ఓరీ దేవుడో.. నాలుగు గంటల వివాహానికి రూ. 37.40 బిల్లు… ఈ వీడియో తప్పక చూడండి..
వివాహాలు ఇకపై కేవలం ఒక ఆచారం కాదు, ఓ మెగా బడ్జెట్‌తో కూడిన గ్రాండ్ ఈవెంట్. ఏటికేడు ఈ పెళ్లిళ్ల ఖర్చు పెరుగుతోందే కానీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఆడంబర సంస్కృతి గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడమే కాకుండా, చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు..అనేది పెద్దలు తరచూ చెబుతుంటారు. ఎందుకంటే వీటికి అయ్యే ఖర్చు అలా ఉంటుంది మరి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో వివాహాల స్వభావం గణనీయంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంటి ప్రాంగణంలోనే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఇంటికి రావటంతో అందరి సమక్షంలో తమ వివాహాలను జరుపుకునేవారు. కానీ, నేడు అది మొత్తం మారిపోయింది. కొన్ని గంటల పాటు జరిగే విలాసవంతమైన కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఖరీదైన హోటళ్ళు, లైటింగ్, అలంకరణలు, ఆహారంతో కలిసి వివాహాలు ఇకపై కేవలం ఒక ఆచారం కాదు, ఓ మెగా బడ్జెట్‌తో కూడిన గ్రాండ్ ఈవెంట్. ఏటికేడు ఈ పెళ్లిళ్ల ఖర్చు పెరుగుతోందే కానీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఆడంబర సంస్కృతి గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడమే కాకుండా, చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈ వీడియో X లో @sarviind అనే ఖాతా నుండి పోస్ట్ చేయబడింది. క్షణాల్లో వేలాది లైక్‌లు, షేర్‌లు, కామెంట్లను సంపాదించింది. కొందరు దీనిని వాస్తవికతకు ప్రతిబింబం అంటున్నారు. మరికొందరు తమ సొంత వివాహ అనుభవాలను పంచుకున్నారు. కానీ ఈ వీడియోలో ప్రజల హృదయాలను తాకేది ఏమిటి?
వీడియోలో, ఒక వ్యక్తి వివాహాల ఆడంబరం గురించి సరళంగా, అందరూ ఆలోచించేలా మాట్లాడుతుంటాడు. వీడియోలో అతను ఇలా వివరించాడు.. నాలుగు గంటల కార్యక్రమానికి బిల్లు 37.40 లక్షల రూపాయలు. ఒక ప్లేట్ భోజనం ఖరీదు 3040 రూపాయలు. ఈ వివాహం ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వివాహం కేవలం నాలుగు గంటల ఆడంబరం కాకూడదు. వివాహం రోజువారీ కార్యక్రమంగా ఉండాలి. పెళ్లి కోసం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసేకంటే..ఈ డబ్బును మీ కుమార్తెకు ఇవ్వండి. వివాహానికి ఎవరు వస్తారు, ఎవరు రారు అనే దానిలో తేడా ఏమిటి? అని చెబుతున్నాడు. అతని మాటలు నేరుగా హృదయాన్ని తాకుతున్నాయి. ఆడంబరమైన వివాహాలకు బదులుగా కుమార్తె అత్తవారింట్లో భవిష్యత్తును భద్రపరచాలని ఆయన సూచిస్తున్నారు.
यह बात दिल छू जाएगी. जयपुर के एक होटल में शादी। 4 घंटे के इवेंट का बिल 37.40 लाख। एक प्लेट का खर्चा 3040 रु. यह शादी कितने घंटे, कितने साल चलेगी? शादी 4 घंटे की शानो शौकत नहीं…हर दिन का इवेंट बनाओ। यह पैसा अपनी बेटी को दे दो। क्या फर्क पड़ता है कि शादी में कौन आया, कौन नहीं.. pic.twitter.com/g2CNEaIbJS
— Arvind Sharma (@sarviind) November 29, 2025
ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. చాలా మంది దీనిని కఠినమైన వాస్తవం అంటున్నారు. మరికొందరు ప్రదర్శన కోసం వివాహాలపై అనవసర ఖర్చు నిజానికి సామాజిక ఒత్తిడి అని రాశారు. చాలా మంది వారు కూడా తమ వివాహ ఖర్చులను తక్కువగా ఉండేలా చూసుకున్నామని, డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టామని రాశారు. ఇది పెళ్లి కాదు, ఇది నాలుగు గంటల ఆర్థిక విపత్తు అని కూడా అంటున్నారు. ఈ వీడియో చాలా మందికి కళ్ళు తెరిపించేదిగా ఉందని, ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియోని తప్పక చూడాలని ప్రజలు స్పష్టంగా పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




