AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి తాళంవేసి ఊరెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూస్తే ఇళ్లంతా కోడిపిల్లలే..! ఏమైందో తెలిస్తే అవాక్కే..

సాధారణంగా నాన్‌ వెజ్‌ తినేవారు ఇంట్లో ఎక్కువ గుడ్లు నిల్వచేస్తుంటారు. ఒకేసారి రెండు మూడు ట్రేల గుడ్లు తెచ్చిపెట్టుకుంటారు. అయితే, అలా నిల్వ ఉంచిన గుడ్లు ఒక్కోసారి పాడైపోతుంటాయి. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇంట్లో నిల్వ ఉంచిన గుడ్లు పొదిగి పిల్లలు బయటకు మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఇది నిజం తల్లి కోడి లేకపోయినా కూడా ఇంట్లో నిల్వ ఉంచిన కోడి గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇంటికి తాళంవేసి ఊరెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూస్తే ఇళ్లంతా కోడిపిల్లలే..! ఏమైందో తెలిస్తే అవాక్కే..
Chicks Hatch From Eggs
Jyothi Gadda
|

Updated on: Nov 30, 2025 | 3:17 PM

Share

సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలకు అద్బుతమైన ప్లాట్‌ఫామ్‌. ఇక్కడ ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయ్యే ప్రదేశం. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు ట్రెండ్‌ అవుతుంటాయి. మరి కొన్నిసార్లు వ్యక్తుల ప్రత్యేకమైన ఆలోచన ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు ముఖ్యాంశాల్లోకి చేరింది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. అందరూ పదే పదే ఈ వీడియోని చూస్తున్నారు. నెటిజన్ల రియాక్షన్లతో కామెంట్ బాక్స్‌ నిండిపోయింది.

వైరల్‌ వీడియో చూస్తుంటే… ఒక ఫ్యామిలీ మొత్తం సెలవుల్లో ఊరెళ్లినట్టుగా తెలుస్తుంది. వెళ్ళే ముందు వారు వంటగదిలో మూడు ట్రేలలో గుడ్లు తెచ్చి పెట్టుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ, వారు ఇంట్లోకి రాగానే వారి ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఇళ్లంతా కోడి పిల్లలు తిరుగుతూ కనిపించాయి. వంటగదిలోని ట్రేలో ఉన్న ప్రతి గుడ్డు నుండి చిన్న పిల్లలు పొదగబడ్డాయి. కొన్ని ట్రేలోనే ఉండిపోయి బయటకు తొంగి చూస్తున్నాయి. మరికొన్ని మూలల్లో, వంటగదిలో, ఇంట్లో వస్తువుల మధ్య దాగి ఉన్నాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒక చిన్న కోళ్ల ఫారం పుట్టుకొచ్చినట్లు అనిపించింది. ఇది ఎలా జరిగిందో తెలియక కుటుంబం ఆశ్చర్యపోయింది. ఒకింత కలవరపడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @RanjanSingh_ అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేయబడింది. వీడియో షేర్ చేసిన వెంటనే ప్రజలు లైక్ చేయడం, షేర్ చేయడం, పెద్ద సంఖ్యలో కామెంట్‌ ప్రారంభించారు. కొందరు దీనిని ప్రకృతి అద్భుతం అని పిలుస్తుండగా, ఈ వీడియోను @RanjanSingh_ అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేయబడింది. వీడియో షేర్ చేసిన వెంటనే ప్రజలు లైక్ చేయడం, షేర్ చేయడం, పెద్ద సంఖ్యలో కామెంట్‌ ప్రారంభించారు.

వీడియో ఇక్కడ చూడండి…

వీడియో చూసిన కొందరు దీనిని ప్రకృతి అద్భుతం అని పిలుస్తుండగా, మరికొందరు సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రెండు నెలల్లో ఇంటి వాతావరణం కోళ్లకు అనుకూలంగా మారిందని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు ఇప్పుడు నేను కోళ్ల పెంపకం కూడా చేయాల్సి ఉంటుందని రాశారు. వీడియో చాలా ఫన్నీగా ఉంది అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..