AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మలేషియాలో భారతీయుడికి ఘోర అవమానం.. సోషల్‌ మీడియా వేదికగా గోడు వెళ్లబోసుకున్న బాధితుడు

మలేషియాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బ్యాంక్‌ బయట పడుకున్న నిరాశ్రయుడైన ఒక భారతీయున్ని స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తి కాళ్లతో తంతు, కర్రతో కొడుతూ అవమానించాడు. బాధితుడు తనకు జరిగిన ఈ ఘోర అవమాన్ని సోషల్‌ మీడియా వేధికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో అతను చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Watch: మలేషియాలో భారతీయుడికి ఘోర అవమానం.. సోషల్‌ మీడియా వేదికగా గోడు వెళ్లబోసుకున్న బాధితుడు
Viral News
Anand T
|

Updated on: Nov 30, 2025 | 2:22 PM

Share

మలేషియాలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ఆదేశంలో తనకు జరిగిన ఘోర అవమాన్ని సోషల్‌ మీడియా వేధికగా పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నిరాశ్రయుడైన అతను ఒక బ్యాంక్ ముందు పడుకుంటే స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తి అతన్ని కాళ్లతో తంతూ.. కర్రతో కొట్టినట్టు ఆయన పేర్కొన్నాడు, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అతను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదురు స్థానిక వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నివేదికల ప్రకారం: సఫీయుద్దీన్ పక్కీర్ మొహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బులు సంపాధించేందుక 2024 లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లాడు. అక్కడే ఏదో పని చేసుకుంటూ ఇండియాలోని తన ఫ్యామిలీకి డబ్బులు పంపాలని అనుకున్నాడు. దీంతో అతను 2024 మార్చిలో అయితే మలేషియాలోని తమిళనాడుకు చెందిన రెస్టారెంట్‌లో వంటవాడిగా ఉద్యోగం ప్రారంభించాడు. అయితే కొన్ని రోజుల్లోనే అతని పరిస్థితి దిగజారిపోయింది. వర్క్ పర్మిట్ కోసం RM3,500 (సుమారు రూ. 75,500), ఆరోగ్య సంరక్షణ కోసం RM1,200 ( రూ 26,000) తన యజమానికి చెల్లించినట్టు సఫీయుద్దీన్ తెలిపాడు.

అయితే అతను జీతం చేసినప్పటికీ యజమాని మాత్రం సఫీయుద్దీన్ జీతం చెల్లిండం ఆపేశాడు. కొన్ని నెలలు పాటు యజమాని అతనికి జీతం చెల్లించకపోవడంతో.. సఫీయుద్దీన్ ఇంటికి డబ్బులు పంపించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా తన యజమాని తన పాస్‌పోర్ట్‌ను కూడా తీసుకున్నాడని అందువల్లే తిరిగి భారతదేశానికి కూడా రాలేకపోయానన్నాడు. ఉద్యోగం మానేద్దాం అనుకున్న ఓనర్ అందుకు అనుమతించలేదు.. దీంతో సఫీయుద్దీన్ గత ఆరు నెలలుగా జాబ్‌ వెళ్లడం మానేశాడు.

భారత్‌కు తిరిగి వెళ్దామంటే పాస్‌పోర్టు లేదు, ఉద్యోగం లేకపోవడంతో డబ్బు లేదు.. దీంతో అతనికి ఉండడానికి నివాసం కూడా లేకుండా పోయింది. ఇక చేసేదేమి లేక సఫీయుద్దీన్ వీధుల్లో నివసిస్తూ.. అక్కడే పడుకోవడం మొదలుపెట్టాడు. అయితే అతను రోజూ ఆమ్‌బ్యాంక్ తమన్ మలూరి బ్రాంచ్ ముందు వెళ్లి పడుకునేవాడు. అది గమనించిన అక్కడి సెక్యూరిటీ అతన్ని కాళ్లతో తంతూ.. కర్రతో కొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు.

ఈ ఘటనపై బాధితులు ఒక స్థానిక మీడియా సంస్థలో మాట్లాడుతూ.. వారు నన్ను వెళ్లిపోవాలని చెబితే, నేను నిశ్శబ్దంగా వెళ్లి ఉండేవాడిని. కానీ నేను చాలా బలహీనంగా, ఆకలిగా, ఒత్తిడికి, నిరాశకు గురయ్యాను అని చెప్పాడు. అలాంటి స్థతిలో వాళ్లు తనతో అలా ప్రవర్తించడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పుకొచ్చాడు. అయితే బాధితుడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడతో స్థానకంగా నిరాశ్రయులకు ఆశ్రయాలను కల్పించే టోనీ లియాన్ అనే వ్యక్తి సఫీయుద్దీన్‌కు ఆశ్రయం కల్పించాడు.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.