AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో లేడీస్.. మీ పర్స్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.. ? దరిద్రం మీ వెంట ఉన్నట్టే..

ఆడవాళ్లు అనేక రకాల డిజైనర్ హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, పర్స్ అనేది డబ్బును దాచుకునేందుకు ఉపయోగించాల్సిన వస్తువు. అంతేకాదు.. అది ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం కూడా. కానీ, మీ పర్సులో ఉంచుకున్న చిన్న వస్తువులు మీ పురోగతి, ఆర్థిక స్థితి, అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? కాబట్టి, డబ్బు ప్రవాహం కొనసాగాలంటే మహిళలు తమ పర్సు నుండి కొన్ని వస్తువులను వెంటనే తీసివేయాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..

హాలో లేడీస్.. మీ పర్స్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.. ? దరిద్రం మీ వెంట ఉన్నట్టే..
Do Not Keep These Things In The Purse
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2025 | 1:37 PM

Share

వాస్తు అనేది మన నిత్యజీవితంలో ప్రతి విషయంలోనూ వర్తిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఆడవారి పర్స్‌కు సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పర్స్‌లో డబ్బులు ఉంచడం సాధారణ విషయం. కానీ, చాలా సార్లు మనం డబ్బులతో పాటుగా కొన్ని ఇతర అనవసరమైన వస్తువులను కూడా మోస్తుంటాం. అయితే ఇలా చేయడం మనల్ని అనుకోని ఖర్చులు, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందట.

మహిళలు ఎల్లప్పుడూ తమ పర్సును శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఇది ప్రతికూలతను తొలగించి సానుకూలతను తెస్తుంది. మీరు పర్స్‌లో పొరపాటున కూడా మందులు ఉంచుకోకూడదు. ఇది మీ పురోగతిని ఆపివేస్తుంది. అలాగే, చాలా సార్లు పాత బిల్లులు, రసీదులు లేదా పనికిరాని కాగితాలు పర్సులోనే ఉంటాయి. కానీ, వాటిని అలా పేరుకుపోనివ్వకండి. వెంట వెంటనే బయటపడేయటం మంచిది.

మహిళలు తమ పర్సులో చిరిగిన, పాత నోట్లను ఉంచుకోకూడదు. అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. తుప్పు పట్టిన పాత కీలు, నాణేలు లేదా లేడీస్ పిన్నులు డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కాకుండా పైన సూచించిన ఇలాంటి వస్తువులను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయట. ఇది మాత్రమే కాదు డబ్బు ప్రవాహానికి కూడా అంతరాయం ఏర్పడుతుందని, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..