AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకే కాదు, కాళ్లలో తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. కాళ్ల నొప్పి, తిమ్మిరి, బలహీనత వంటివి ప్రధాన లక్షణాలు. పొగతాగడం మానేయడం, క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం వంటి జీవనశైలి మార్పులతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, గుండె, కాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
Leg Pain Could Be A Sign Of High Cholesterol
Krishna S
|

Updated on: Nov 29, 2025 | 11:29 AM

Share

కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యకరమైన కణాల నిర్మాణానికి అత్యంత అవసరమైన మైనపు పదార్థం. అయితే, ఈ కొలెస్ట్రాల్ పరిమితి మించితేనే అసలు సమస్య మొదలవుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారి తీయడమే కాకుండా ఇటీవల నిపుణులు గుర్తించిన దాని ప్రకారం.. కాళ్లలో కూడా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు

చెడు కొలెస్ట్రాల్: ఇది రక్తనాళాల గోడలపై పేరుకుపోయి, ఫలకంను ఏర్పరుస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ అడ్డుకుంటుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు.

మంచి కొలెస్ట్రాల్: శరీరంలో దీన్ని స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెకు చాలా మంచిది, ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అందుకే దీనిని మంచి కొలెస్ట్రాల్ అని అంటారు.

కాళ్లలో కనిపించే ముఖ్య లక్షణాలు

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అది కాళ్ళలోని ధమనులలో పేరుకుపోయి, రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల కాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

కొద్ది దూరం నడిచిన తర్వాత కూడా కాళ్ళలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కాళ్లు తరచుగా తిమ్మిరిగా అనిపించడం, లేదా తాకినా స్పర్శ జ్ఞానం తక్కువగా ఉంటుంది. కాళ్ళ కండరాలకు సరైన పోషకాలు అందక, అవి శక్తిని కోల్పోతుంది .

విస్మరించకూడని 7 ఇతర సంకేతాలు

అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతుంది. కానీ ఈ 7 సంకేతాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గోళ్లు: గోళ్లు పెళుసుగా మారడం లేదా గోళ్ళ లోపల చారలు ఏర్పడటం.

చర్మం మెరుపు: కాళ్ళపై చర్మం అకారణంగా మెరుస్తూ ఉండటం.

పుండ్లు: కాళ్లపై అకస్మాత్తుగా పుండ్లు కనిపించడం.

రంగు మార్పు: చర్మం రంగు నీలం లేదా లేత రంగులోకి మారడం.

లైంగిక సమస్యలు: పురుషులలో అంగస్తంభన లోపం

జుట్టు రాలడం: ఫలకం వల్ల జుట్టు కుదుళ్లకు పోషకాలు అందక జుట్టు రాలడం.

బలం తగ్గడం: కాళ్ల కండరాలలో బలం తగ్గడం.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మార్గాలు

మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలిస్తే, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఈ జీవనశైలి మార్పులు చేసుకోవాలి.

  • పొగతాగడం వెంటనే ఆపేయాలి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • మద్యం సేవించడం పూర్తిగా మానుకోవాలి.
  • బయట దొరికే, నూనె ఎక్కువగా ఉన్న, కారంగా ఉండే ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.

ఈ చిన్న మార్పుల ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకుని గుండె ఆరోగ్యాన్ని, కాళ్ల రక్త ప్రసరణను కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..