Gold Rate: ఓరీ దేవుడో.. బంగారం, వెండిపై ఆశలు ఆవిరైనట్టేనా..? రూ.2 లక్షలకు చేరువలో..
తాజాగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందన్న ఆందోళన పెరుగుతోంది. ఇవాళ శనివారం (నవంబర్ 29న) ఒక్కరోజే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,250 పెరిగి రూ.1,19,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ..

బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకున్న వారికి షాకిస్తూ గోల్డ్ రేట్స్ చుక్కలనంటుతున్నాయి. వెండి వస్తువులు కొనాలనుకున్న వారి ఆశలు ఆశలుగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందన్న ఆందోళన పెరుగుతోంది. ఇవాళ శనివారం (నవంబర్ 29న) ఒక్కరోజే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,250 పెరిగి రూ.1,19,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,360 పెరిగి రూ.1,29,820 పలుకుతోంది.
ఇక పసిడి బాటలోనే పయనించిన వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై ఏకంగా రూ.9,000 పెరగడంతో రూ.1,92,000 వద్ద ధర కొనసాగుతోంది. 5 రోజుల్లో కేజీ వెండిపై రూ.21 వేలు పెరిగింది. త్వరలోనే వెండి ధర రూ.2 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








