AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10ఏళ్ల నాటి పాత సోఫా కొన్న జంటకు ఊహించన షాక్..! క్లీన్‌ చేస్తుండగా బయటపడ్డ సీక్రెట్‌ కోడ్..!

పదేళ్ల క్రితం కొన్న పాత సోఫాలో దంపతులకు ఊహించని రహాస్యం దొరికింది. అది వియత్నామీస్ భాషలో ఉంది. ఆ కోడ్‌ భాషకు అర్థం ఏంటో తెలియక వారు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. 'నేను నిన్ను మిస్ అవుతున్నాను' అనే భావోద్వేగ కవితగా గుర్తించారు. దీని వెనుక ఉన్న కారణం ఇంకా అంతుచిక్కలేదు.

10ఏళ్ల నాటి పాత సోఫా కొన్న జంటకు ఊహించన షాక్..! క్లీన్‌ చేస్తుండగా బయటపడ్డ సీక్రెట్‌ కోడ్..!
Second Hand Sofa Secret
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2025 | 9:13 AM

Share

దాదాపుగా అందరి ఇళ్లలోనూ సోఫాలు కామన్. మెయిన్‌ హాల్‌లో ఉండే సోఫాలో కూర్చుని మనం హాయిగా విశ్రాంతి తీసుకుంటాం..టీ చూస్తాం, కుటుంబ సభ్యులతో కలిసి చిట్‌చాట్‌ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ, మీ సోఫా కుషన్ల కింద ఒక చీకటి రహస్యం దాగి ఉండవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? కానీ, న్యూజిలాండ్ నివాసి టౌటారి సాండర్స్, అతని భార్యకు సరిగ్గా అదే జరిగింది. వారు గత పదేళ్ల క్రితం వారి ఫ్రెండ్‌ నుండి ఒక సెకండ్ హ్యాండ్ సోఫాను కొనుగోలు చేశారు. కానీ, ఇటీవల ఆ జంట సోఫాను కుషన్లను బయటకు తీసి మరీ శుభ్రం చేయటం మొదలుపెట్టారు. కానీ, అందులో వారు ఊహించనిది చూశారు. అది చూసిన ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. సోఫా కుషన్స్‌ తొలగించి శుభ్రం చేస్తున్న క్రమంలో లోపలి కుషన్‌పై ఒక సీక్రెట్‌ కోడ్ రూపంలో రాసివున్న వింత మెసేజ్‌, మరొక వైపున ఒక పేరును వారు గుర్తించారు.

ఆ వింత మెసేజ్‌ చూసిన టౌటారి దంపతులు ముందుగా షాక్‌ తిన్నారు. కానీ, ఆ సోఫా వియత్నాంలో తయారు చేయబడిందని వారికి తెలుసు. కాబట్టి, వారు దానికి సంబంధించిన యాప్‌ ద్వారా ఆ మెసేజ్‌ ఏంటో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, వారికి సాధ్యపడలేదు. ఆ సీక్రెట్‌ కోడ్‌ని అర్థంచేసుకోలేకపోయిన టౌటారి దంపతులు ఈ రహస్యాన్ని చేధించడానికి సరైన మార్గం సోషల్ మీడియాలో అని భావించారు. వెంటనే సోఫా, దాని లోపల కనిపించిన మెసేజ్‌ను ఫోటో తీసి ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. వారి పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారడంతో సమాధానాలు కూడా పెద్ద సంఖ్యలో వెల్లువెత్తాయి. సోఫాలో కనిపించిన ఆ వింత మెసేజ్‌ ఒక కవిత అని తెలిసింది.

Found in couch cushion byu/ItsTheGaijin inwhatisit

ఆ కవిత అనువాదంలో ఇలా ఉంది,”ఆ నది ఇప్పటికీ వేల జీవితాల కోసం ప్రవహిస్తుంది. కష్టాల నేపథ్యంలో నేను నిన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. నువ్వు దూరంగా ఉన్నప్పుడు నేను ఇప్పటికీ నిన్ను మిస్ అవుతున్నాను. నీ కళ్ళు, నీ చిరునవ్వును మిస్ అవుతున్నాను. అనే అర్థంగా వివరించారు. మరొక యూజర్‌ ఇలా రాశారు. ఈ కవిత లూక్ బ్యాట్ అనే ప్రసిద్ధ వియత్నామీస్ పద్య రూపానికి చెందినదని స్పష్టం చేశారు. ఆ మెసేజ్ అసలు అర్థం, ప్రాముఖ్యత తెలిసిన తరువాత టౌటారి దంపతులు హమ్మయ్య అనుకున్నారు. ఇది ఒక అందమైన కవిత అని వారు ఉపశమనం పొందామని చెప్పారు. అయితే, ఇది ఉపశమనం కలిగించే అంశమే అయినప్పటికీ, ఆ వ్యక్తి సోఫాపై ఇంతటి భావోద్వేగమైన కవితను ఎందుకు రాశాడనే దానికి అర్థం, రహస్యం ఏంటో మాత్రం తెలియరాలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..