AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపాయి చాలు..! రూ.31 లక్షల కట్నాన్ని తిరస్కరించిన వరుడు

ఉత్తరప్రదేశ్‌లోని అవధేశ్ రానా, అదితి సింగ్‌ల వివాహంలో వధువు కుటుంబం రూ.31 లక్షల కట్నం ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే, అవధేశ్ దాన్ని తిరస్కరించారు. కట్నం తీసుకోవడం తన మనస్సాక్షికి విరుద్ధమని, తమ సంబంధం రూపాయి దగ్గరే ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదర్శవంతమైన నిర్ణయం సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చింది.

రూపాయి చాలు..! రూ.31 లక్షల కట్నాన్ని తిరస్కరించిన వరుడు
Groom Returns Dowry
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2025 | 10:02 AM

Share

వరకట్నం వేధింపు వార్తలతో ప్రతిరోజూ న్యూస్‌ పేపర్లు నిండిపోతున్నాయి. కట్నం చాలలేదని నవ వధువు దారుణ హ్యత అంటూ నిత్యం అనేక బ్రేకింగ్‌ న్యూస్‌ చూస్తుంటాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఎవరూ చేయని గొప్పపని చేశాడు. సామాజిక దురాచారమైన వరకట్నానికి వ్యతిరేకంగా ఎవరూ చేయని పని చేశాడు. వధువు కుటుంబం అతనికి 3.1 మిలియన్ రూపాయల కట్నాన్ని వద్దని తిరస్కరించాడు. అతను పూర్తి కట్నాన్ని తిరస్కరించి కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వధువు కుటుంబం అతనిని ఎంతగానో ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ, అతను నిరాకరించాడు. అతడు తీసుకున్న ఈ నిర్ణయంతో వివాహా వేడుకకు హాజరైన బంధుమిత్రులు అతన్ని ఎంతగానో ప్రశంసించారు. కల్యాణ వేదికమొత్తం చప్పట్లతో మారుమోగింది.

ఉత్తరప్రదేశ్‌లోని నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్‌ల వివాహం ఈ నెల 22న జరిగింది. వివాహ సమయంలో వరుడికి రూ.31 లక్షల కట్నం ఇవ్వడానికి వధువు కుటుంబం సిద్ధమయ్యారు. అప్పుడు అవధేశ్ రూ.31 లక్షల కట్నాన్ని తిరస్కరించారు. ‘క్షమించండి. ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం నా మనస్సాక్షికి విరుద్ధం. మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. రూపాయి దగ్గరే ముగుస్తుంది’ అని అవధేశ్ రానా అన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కట్నం కోరుకునే వారికి తగిన సమాధానంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వధువు అదితి తండ్రి సునీల్ COVID-19 మహమ్మారి సమయంలో మరణించారు. ఆ తర్వాత అదితి, ఆమె సోదరుడు వారి తాత సుఖ్‌పాల్‌ వద్దే పెరిగారు. అదితి అక్కడే తన MSc పూర్తి చేసింది. బుధానాకు చెందిన వ్యాపారవేత్త అవధేష్ రాణాతో ఆమెకు వివాహం నిశ్చయించారు ఆమె తాత సుఖ్‌పాల్. ఈ సందర్బంగా వరుడు అవధేశ్‌ మాట్లాడుతూ.. తాము వరకట్న వ్యవస్థకు వ్యతిరేకం అని చెప్పారు. వరకట్నం తీసుకోవడం తప్పు. చాలా మంది ప్రజలు తమ కుమార్తెల వివాహం కోసం అప్పులు చేస్తారు. వారి జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ ఆచారం ముగియాలి. మా వివాహం కేవలం ఒక రూపాయి విలువైనది. కాబట్టి 31 లక్షల రూపాయలు తీసుకునే ప్రశ్నే లేదని చెప్పాడు. ఈ వివాహం రెండు కుటుంబాలను కలిపి ఉంచడమే కాకుండా వరకట్న వ్యవస్థపై ప్రజల్లో మార్పుకు నాంది కావాలని కోరుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..