ఎలక్ట్రిక్ కారు అద్భుతం..! ఇలాంటి కార్లు ఉంటే చాలు మావా.. ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేన్నటే..
చైనా రూపొందించిన ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు తన చక్రాలను 90 డిగ్రీలు తిప్పుతూ ట్రాఫిక్‌ను సులభంగా తప్పించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. 'క్రాబ్ వాక్' మోడ్‌లో పక్కకు కదిలే ఈ కారు పార్కింగ్, నగర ట్రాఫిక్ సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది. BYD, బావోజున్ వంటి మోడళ్లతో చైనా EV సాంకేతికత భవిష్యత్తును చూపుతోంది.

చైనా తన సాంకేతిక నైపుణ్యం, కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. బుల్లెట్ రైళ్ల నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రతి యేడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆవిష్కరణలను ప్రవేశపెడుతుంది. ఇప్పుడు, మరో కొత్త ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారు తన చక్రాలను 90 డిగ్రీలు తిప్పుతూ ట్రాఫిక్‌లో ఎటు కావాలంటే అటువైపుకు తిరుగుతున్నట్టుగా చూపించే కొత్త వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది మన గ్రాఫిక్ సినిమాల్లో కూడా లేని విధంగా కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు సడెన్‌గా క్రాబ్ వాక్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో చైనా కారు తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రారంభమవుతుంది. ఆ ట్రాఫిక్ మధ్యలో ఒక చిన్న కారు ఇరుక్కుపోయి కనిపిస్తుంది. అక్కడ్నుంచి ఎటూ కదలడానికి కూడా స్థలం లేకుండా ఉంది. అంతలోనే ఆ కారు తన చక్రాలను పక్కకు తిప్పి నెమ్మదిగా లైన్ నుండి బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఇలా పక్కకి కదలడాన్ని క్రాబ్ వాకింగ్ అని పిలుస్తారు. ఇక్కడ కారు తిరగకుండానే పక్కకు కదలగలదు. అలా కొన్ని సెకన్లలోనే ఆ కారు మెయిన్ లేన్‌ను వదిలి పక్కకు కదులుతుంది. ఈజీగా ట్రాఫిక్‌ను తప్పించుకుంటుంది. దాని వెనుక ఉన్న ఆడి ముందుకు కదిలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది.
ఈ భవిష్యత్ సాంకేతికత ఏ కార్లలో ఉంది.?
ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకి క్యాప్షన్‌లో ఉంది..కార్లు పక్కకు ఎలా కదులుతాయో చూడండి… చైనా EV భవిష్యత్తుకు స్వాగతం! అంటూ రాశారు. ఈ పోస్ట్ BYD యాంగ్వాంగ్ U7, బావోజున్ యెప్ వంటి చైనా కొన్ని భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తుంది. ఇలాంటి కారు తన చక్రాలను 90 డిగ్రీలు తిప్పడం ద్వారా ప్రయాణాన్ని సులభం చేయగలదు. ఈ లక్షణం ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్‌ను సులభతరం చేస్తుంది. కారును 360 డిగ్రీలు తిప్పగలదు. ఈ సాంకేతికత నగరాల్లో డ్రైవింగ్, పార్కింగ్ ఇబ్బందులను గణనీయంగా తగ్గిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
అక్టోబర్ 4న షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షలకు పైగా వీక్షించారు. ఒకరు ఇలా రాశారు – ఇది బహుశా బైక్ లేన్ లేదా అత్యవసర లేన్ లాగా కనిపిస్తుంది… కానీ ఈ ఫీచర్ అద్భుతంగా ఉందని అంటున్నారు. మరొకరు సరదాగా ఇలా అన్నారు – మన కార్లను కూడా ఇలా పార్క్ చేసి ఉంటే, రోజువారీ పార్కింగ్ టెన్షన్ అంతమైపోతుందని వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




