AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు

ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 4:01 PM

Share

ఉట్కియాగ్‌విక్, అలాస్కా, 64 రోజుల ధ్రువరాత్రిలోకి ప్రవేశించింది. భూమి అక్షం వంపు వల్ల ఆర్కిటిక్ సర్కిల్‌లో సూర్యుడు అస్తమించి జనవరి 22, 2026 వరకు కనిపించడు. సివిల్ ట్వైలైట్, అరోరా బోరియాలిస్ కొంత వెలుగును ఇస్తాయి. ఈ సుదీర్ఘ చీకటి అతి శీతల ఉష్ణోగ్రతలు, పోలార్ వోర్టెక్స్‌కు కారణమవుతుంది. వేసవిలో నిరంతర పగటిని కూడా ఈ పట్టణం అనుభవిస్తుంది. ఇది ఆర్కిటిక్‌లో జీవన అనుకూలతను చూపుతుంది.

చలి, చీకటి, మైనస్ ఉష్ణోగ్రతలు.. ఇలాంటి వాతావరణాన్ని ఒక నగరం స్వాగతిస్తోంది. అమెరికాలో ఉత్తరాన ఉన్న చిన్న పట్టణం, ఉట్కియాగ్‌విక్, అలాస్కాలో నవంబర్‌ 19వ తేదీ బుధవారం.. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఇక ఈ ప్రాంత వాసులు మళ్లీ సూర్యుడిని చూడాలంటే, 64 సుదీర్ఘ రాత్రులు గడవాల్సిందే! ఈ పట్టణం ఇప్పుడు ’ధ్రువరాత్రి’ పోలార్‌ ైట్‌లోకి ప్రవేశించింది. జనవరి 22, 2026 వరకు కొనసాగుతుంది. ఇంత సుదీర్ఘమైన చీకటికి కారణం భూమి అక్షం వంపు. ఆర్కిటిక్‌ సర్కిల్‌పై ఉట్కియాగ్‌విక్‌ ఉన్న స్థానం వల్ల జరిగే సహజ పరిణామం. ధ్రువ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హొరైజన్‌ కిందే ఉండిపోతాడు.నిజానికి, 64 రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తుంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఉట్కియాగ్‌విక్‌ను వెలిగిస్తుంది. దీనిని సివిల్‌ ట్వైలైట్‌ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ రోజూవారీ కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు. అద్భుతమైన ’అరోరా బోరియాలిస్‌’ లేదా నార్తర్న్‌ లైట్స్‌ కూడా ఈ చీకటి రాత్రులలో అద్భుతమైన వెలుగును అందిస్తాయి. సూర్యరశ్మి లేకపోవడం అంటే, పగటిపూట ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయి. ఈ సుదీర్ఘ చీకటి కాలం నుంచే పోలార్‌ వోర్టెక్స్‌ అనే భారీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఇది అత్యంత శీతల గాలిని కలిగి ఉంటుంది. ఈ పోలార్‌ వోర్టెక్స్‌ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతూ.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి ప్రభావాన్ని చూపుతుంది. ఉట్కియాగ్‌విక్‌ కేవలం సుదీర్ఘ చీకటికి మాత్రమే కాదు, అద్భుతమైన వైరుధ్యానికి కూడా నిదర్శనం. శీతాకాలంలో 64 రోజులు చీకటి ఉంటే, వేసవిలో పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది. ఇక్కడ దాదాపు మూడు నెలల పాటు.. అంటే సుమారు 84 రోజులు నిరంతరాయంగా పగటి వెలుతురు ఉంటుంది. ఈ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడి 4,400 మంది నివాసితులు స్వాగతిస్తారు. భూమి అక్షం వంపు మానవ జీవితాలపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో, ఆర్కిటిక్‌లో జీవనం ఎంత అద్భుతమైన అనుకూలతను కలిగి ఉంటుందో ఈ ధ్రువ రాత్రి నిరూపిస్తోంది. జనవరి 22, 2026న సూర్యుడు తిరిగి ఉదయించే ఆ క్షణం కోసం ఉట్కియాగ్‌విక్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో