AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్

పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 4:24 PM

Share

శాన్ ఫ్రాన్సిస్కోలో ముగ్గురు సోదరులకు తమ తల్లి ఇంట్లో పాత సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం దొరికింది. దానిని టెక్సాస్‌లో వేలం వేయగా $9.12 మిలియన్లు (దాదాపు ₹81 కోట్లు) పలికింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఆ అన్నదమ్ములు, అరుదైన కామిక్‌తో చరిత్ర సృష్టించారు. సూపర్ మ్యాన్ పాత్రకున్న అనూహ్య క్రేజ్, చరిత్ర దీనికి కారణం.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ మహిళ ఇటీవల కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురూ తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇంట్లోని సామాన్లను తొలగించి శుభ్రం చేస్తుండగా పాతకాలం నాటి సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం దొరికింది. అప్పట్లో ఈ పుస్తకానికి చాలా క్రేజ్ ఉండేదని తెలుసుకున్న ముగ్గురు సోదరులూ దానిని వేలం వేయాలని భావించారు. ఆ పాత పుస్తకాన్ని తీసుకుని ఆ ముగ్గురు అన్నదమ్ములూ.. టెక్సాస్ లోని ఓ కామిక్ పుస్తకాలు వేలం వేసే సంస్థను సంప్రదించారు. నవంబర్‌ నెల మొదట్లో ఈ కామిక్ పుస్తకాన్ని వేలం వేయగా.. ఏకంగా 9.12 మిలియన్ డాలర్లకు మన రూపాయల్లో సుమారు 81.25 కోట్లకు అమ్ముడుపోయింది. ఓ కామిక్ పుస్తకానికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని వేలం నిర్వహించే సంస్థ తెలిపింది. దీంతో ఆ ముగ్గురు సోదరులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. సినిమాలే లేని రోజుల్లో ప్రజలకు కథల పుస్తకాలు, కామిక్సే వినోదం. అప్పట్లో సూపర్ మ్యాన్ పాత్రకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి. చిన్నా పెద్దా తేడా లేకుండా వరల్డ్‌ వైడ్‌గా ఉన్న ప్రేక్షకులందరిని ఈ పాత్ర అలరించింది. మిగతా సూపర్‌ హీరోలతో పోలిస్తే ఈ క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సూపర్ మ్యాన్..ఒంటికి అతుక్కున్నట్లు ఉండే టైట్​ ఔట్‌ఫిట్‌తో కనిపిస్తాడు.సూపర్‌మ్యాన్‌ కామిక్స్‌ను పరిచయం చేసే సమయంలో రీడర్స్‌ను ఆకర్షించేందుకు ఇతర పాత్రలకు భిన్నంగా ఆ క్యారెక్టన్​ డిజైన్‌ చేయాలనుకున్నారట గ్రాంట్‌ మారిసన్. దీని కోసం 1930ల్లో నాటి ఫొటోలు, కామిక్‌ బుక్స్‌ను విశ్లేషించారట. 90’s కిడ్స్‌కు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మూవీ ఏదంటే అది ‘సూపర్‌మ్యాన్‌’. స్టేజ్‌లపై పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు బ్రిడ్జ్‌లు పైకి ఎత్తడం, రైళ్లను ఆపడం వంటి సీన్స్​ చూపించే సమయంలో బ్లూ కలర్ డ్రెస్‌ పై కండలు ఎలివేట్ అయ్యేవి. అలా సూపర్‌మ్యాన్‌ ఎంతో బలవంతుడని చూపించడంతో పాటు, ప్రేక్షకుడు నమ్మే విధంగా ఉండటం వల్ల అదే కామిక్స్‌ లుక్‌ను సినిమాల రూపంలోనూ తీసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌.. ధర ఎంతో తెలుసా ??

ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు

CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో