దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్
ముంబైకి చెందిన భరత్ జైన్, దేశంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. ఈయనకు రూ.7.5 కోట్ల ఆస్తులు, రెండు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. నెలకు రూ.75,000 పైగా సంపాదిస్తాడు. తన సంపాదనను తెలివిగా పెట్టుబడి పెట్టి కోటీశ్వరుడయ్యాడు. బిచ్చగాళ్లను తక్కువ అంచనా వేయరాదని ఆయన కథ నిరూపిస్తుంది. ఇలాంటివారు చాలా మంది ఉన్నారు.
బిచ్చగాళ్ళు అంటే అందరికీ లోకువే. అయితే.. బిచ్చగాళ్లంతా డబ్బులు లేని పేదలు అనుకోవటానికి వీల్లేదు. వీళ్లలో కోటీశ్వరులూ ఉన్నారంటే నమ్మాల్సిందే. ముంబై కి చెందిన భరత్ జైన్ అనే ఓ బిచ్చగాడు ఇదే కేటగిరీ కిందికి వస్తాడు. రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదమ్మా..అక్షరాలా రూ.7.5 కోట్ల ఆస్తులు.. పలు షాపులు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన రోజువారి సంపాదన రెండున్నర వేల పైనే. అంటే నెలకు 75000 సంపాదిస్తాడు. అంటే దాదాపుగా ఓ ఐటీ ఉద్యోగి సంపాదన అంత.. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయం. ఆ రోజు తాను తిరిగిన ప్రాంతం.. దాతల స్పందనను బట్టి తన ఆదాయంలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నాడు. బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ 54 ఏళ్ల భరత్ జైన్ ముంబై లోని చత్రపతి శివాజీ టెర్మినస్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటాడు. రోజుకి 10-12 గంటలు ఈ పనిలో ఉంటూ ఒక్కో రోజు 4000 వరకూ సంపాదిస్తాడట. ఇన్నేళ్లుగా తన సంపాదనను చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేసాడు. అనేక ఏళ్ల క్రితమే 1.4 కోట్లతో ముంబాయిలో రెండు ఫ్లాట్స్ కొన్నాడు. తండ్రి, తమ్ముడు, భార్య, ఇద్దరు పిల్లలతో సొంత ఫ్లాట్ లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి రెండు దుకాణాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తున్నాయి. పేదరికం కారణంగా తాను సరిగా చదువుకోలేకపోయినా తన ఇద్దరు బిడ్డలను మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నాడు. భవిష్యత్తు కోసం ఇంకొన్నాళ్ళు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నాడు. అదే సమయంలో తనకు ఆశ.. దురాశ లేదని.. పిసినారిని కూడా కానని చెప్పిన జైన్ అప్పుడప్పుడు గుళ్లలో దానాలు.. విరాళాలు కూడా ఇస్తుంటానని అన్నాడు. దేశంలో మొత్తం 4,13,670 మంది బిచ్చగాళ్ల ఉన్నట్లు జనగణనలో తేలింది. జైన్‌తో పాటు సంభాజి కాలే రూ.1.5 కోట్ల ఆస్తులు.. లక్ష్మి దాస్ రూ.1 కోటి ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్చు గాళ్ళుగా రికార్డు సాధించారు. సో.. బిచ్చగాళ్లను తేలికగా చూడకండి. వాళ్ళు మీకన్నా రిచ్చు గాళ్ళు కావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…
Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న
పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

