AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌.. ధర ఎంతో తెలుసా ??

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌.. ధర ఎంతో తెలుసా ??

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 4:14 PM

Share

హర్యానాలో HR88B8888 వీఐపీ నంబర్ ప్లేట్ రూ.1.17 కోట్లకు అమ్ముడుపోయి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రికార్డు సృష్టించింది. కార్ల యజమానులు తమ లగ్జరీ వాహనాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కేరళలో సైతం '0007' నంబర్ రూ.45.99 లక్షలకు అమ్ముడైంది. ఈ వీఐపీ నంబర్ ప్లేట్ల వేలం ఆన్‌లైన్‌లో జరుగుతుంది, ఇది స్టేటస్ సింబల్‌గా మారింది.

ఖరీదైన కార్ల గురించి మీరు చాలా వినే ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు లగ్జరీ కార్లను ఇష్టపడతారు. వారి గ్యారేజీలో ఒకటి కంటే ఎక్కువ సూపర్ కార్లు ఉంటాయి. వీటి ఫొటోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ, కార్లే కాదు, VIP నంబర్ ప్లేట్‌లను దక్కించుకునేందుకు కొందరు ఉత్సాహం చూపుతుంటారు. వాటి కోసం వేలంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఒక కారును మరొక కారు నుంచి భిన్నంగా చేసే విషయం నెంబర్ ప్లేట్‌. హర్యానాలో ఒక కారు నెంబర్‌కు వెచ్చించిన మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ‘HR88B8888’ అనే నంబర్ ప్లేట్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌గా చరిత్ర సృష్టించింది. బుధవారం నవంబర్ 26న హర్యానాలో ఈ నెంబర్‌కు వేలం నిర్వహించగా, రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. హర్యానాలో వీఐపీ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికొకసారి ఆన్‌లైన్ వేలం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు, బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పై బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు ప్రకటించే వరకు బిడ్డింగ్ ఆట ప్రారంభమవుతుంది. వేలం పూర్తిగా ఆన్‌లైన్‌లో అధికారిక fancy.parivahan.gov.in పోర్టల్‌లో జరుగుతుంది. ఈ వారం, బిడ్డింగ్ కోసం వచ్చిన అన్ని నంబర్లలో, ‘HR88B8888’ రిజిస్ట్రేషన్ నంబర్‌కు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 45 వాహనదారులు పోటీ పడ్డారు. బేస్ బిడ్డింగ్ ధరను రూ. 50,000 గా నిర్ణయించారు. ఇది ప్రతి నిమిషం పెరుగుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్లకు స్థిరపడింది. గత ఏప్రిల్‌లో, కేరళకు చెందిన టెక్ బిలియనీర్ వేణు గోపాలకృష్ణన్ తన లంబోర్గిని ఉరుస్ కారు కోసం “0007” అనే VIP లైసెన్స్ నంబర్ ప్లేట్‌ కోసం రూ. 45.99 లక్షలు ఖర్చు చేసారు. ఐకానిక్ జేమ్స్ బాండ్ కోడ్‌ను గుర్తుకు తెచ్చే ‘0007’ నంబర్ ప్రత్యేకతను చాటుకుంది.ఈ నంబర్ కోసం బిడ్డింగ్ రూ. 25,000 వద్ద ప్రారంభమై అంతకంతకు పెరిగింది. ఫలితంగా రికార్డు స్థాయిలో తుది ధర పలికింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు

CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో