ఈషా ఫౌండేషన్, సద్గురుకు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
ఈషా ఫౌండేషన్ మరియు సద్గురువుపై పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని తమిళ మీడియా సంస్థ 'నక్కీరన్'ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈషా ఫౌండేషన్ స్వాగతిస్తుంది. ఎంతటి పరువు నష్టం కలిగించినా, పథకం ప్రకారం తప్పుడు సమాచారం సృష్టించినా మానవ సంక్షేమ ప్రయత్నాలను అడ్డుకోరని ఈశా ఫౌండేషన్ తేల్చి చెప్పింది.

ఈషా ఫౌండేషన్ మరియు సద్గురువుపై పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని తమిళ మీడియా సంస్థ ‘నక్కీరన్’ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈషా ఫౌండేషన్ స్వాగతిస్తుంది. ఎంతటి పరువు నష్టం కలిగించినా, పథకం ప్రకారం తప్పుడు సమాచారం సృష్టించినా మానవ సంక్షేమ ప్రయత్నాలను అడ్డుకోరని ఈశా ఫౌండేషన్ తేల్చి చెప్పింది.
ఇషా ఫౌండేషన్, సద్గురువులకు వ్యతిరేకంగా ప్రచురించిన పరువు నష్టం కలిగించే వీడియోలు, కథనాలను తొలగించాలని తమిళ మీడియా సంస్థ నక్కీరన్ మీడియాను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును స్వాగతిస్తూ, తప్పుడు, దురుద్దేశపూర్వక కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తామని ఇషా ఫౌండేషన్ పేర్కొంది. కేసును తొలి దశలోనే తిరసర్కరించాలని కోరుతూ నక్కీరన్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ స్పష్టమైన తీర్పును వెలువరించారు. ఆర్డర్ 7 రూల్ 11 కింద దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్లు తెలిపారు. అభ్యంతరకరమైన విషయాలన్నింటినీ తొలగించాలని సూచించారు.
2024లో దాఖలైన ఒక పరువు నష్టం దావా నుండి ఈ కేసు మొదలైంది. అటువంటి కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను ప్రచురించకుండా నిరోధించాలని కోరుతూ, ఫౌండేషన్ 2024లో ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. తమిళ పత్రిక నక్కీరన్ పబ్లికేషన్స్ తమ ప్రతిష్టకు భంగం కలిగించే విషయాన్ని ప్రచురించిందని ఇషా ఫౌండేషన్ ఆరోపించింది. ఆ ఫౌండేషన్ రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని కూడా కోరింది. సుప్రీంకోర్టు ఆ తర్వాత నక్కీరన్ ఈ కేసును ఢిల్లీ నుంచి చెన్నైకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇషా ఫౌండేషన్ కూడా అలాంటి సమాచారం ప్రచురణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేసింది. జూలై 2025లో, హైకోర్టులో తమ స్టే అభ్యర్థనను సుప్రీం కోర్టు ఫౌండేషన్‌ను ఆదేశించింది. అలాగే, ఆర్డర్ 7, రూల్ 11 ప్రకారం హైకోర్టులో తన అభ్యంతరాలను లేవనెత్తే స్వేచ్ఛను నక్కీరన్‌కు కూడా కల్పించారు. 2025 డిసెంబర్‌లో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, ప్రాథమికంగా ఆ కంటెంట్ పరువు నష్టం కలిగించేదిగా ఉందని, దానిని తొలగించడం అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. సరియైన ఆధారం లేకుండా ప్రచురించిన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవచ్చనే కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ఇషా ఫౌండేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశపూర్వక ప్రయత్నంలో భాగంగా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలను ప్రచారం చేయడం దురదృష్టకరమని ఈశా ఫౌండేషన్ పేర్కొంది. మూడు దశాబ్దాలకు పైగా, ఇషా ఫౌండేషన్ బృహత్తర సామాజిక అభివృద్ధికి, మానవ సంక్షేమానికి అంకితమై ఉందన్నారు. ఈ కృషి ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. బాధ్యులపై ఇషా ఫౌండేషన్ తగిన చట్టపరమైన చర్యలను కొనసాగిస్తుందని వెల్లడించింది. ఎంత పరువు నష్టం కలిగించినా, పథకం ప్రకారం తప్పుడు సమాచారం సృష్టించినా మానవ సంక్షేమం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోలేవని ఈశా ఫౌండేషన్ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
