Viral Video: వావ్ ఏం ట్యాలెంట్ బ్రో.. జేసీబీలతో నాగిణి డ్యాన్స్ చేయించిన ఘనుడు..వీడియో చూడాల్సిందే..
సాధారణంగా మనుషులు చేసే నాగిణి డ్యాన్స్‌ను JCB తో చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక డ్రైవర్ తన JCB ని వేణువు బీట్‌కు తగ్గట్టుగా నాగిణి స్టెప్స్ వేయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వినోదాత్మక దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంటర్‌నెట్‌లో JCB నాగిణి డ్యాన్స్ వైరల్ అవుతోంది.

నాగిణి డ్యాన్స్ బాగా ఫేమస్..పెళ్లిళ్లు, దావత్‌లు, సంతోషకరంగా సాగే భారీ ఊరేగింపు సందర్బాల్లో చాలా మంది నాగిణి డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడేందుకు ఈ డ్యాన్స్ ముచ్చట్లు అనుకుంటున్నారా..? అక్కడికే వస్తుంన్నాం…ఎందుకంటే..మనుషులు నాగిణి డ్యాన్స్ చేయడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ, JCB కూడా నాగిణి డ్యాన్స్ చేయగలదని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇంటర్‌నెట్‌లో JCB నాగిణి డ్యాన్స్ వైరల్ అవుతోంది.
నిర్మాణ ప్రదేశాలలో పనిచేసే JCBలను మీరు తరచుగా చూసే ఉంటారు. కానీ, అవి సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉండటం ఎప్పుడైనా చూశారా..? జేసీబీలు డ్యాన్స్ చేయటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా..? కానీ, మీరు ఇలాంటి ప్రత్యేకమైన దృశ్యాన్ని చూడవచ్చు, ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో జేసీబీలు నాగిని డ్యాన్స్ చేస్తున్నాయి. ఈ వీడియో మిమ్మల్ని నిజంగానే నవ్విస్తుంది.
ఈ వీడియోలో హైలైట్ ఏమిటంటే మనుషుల్లాగే కనిపించే JCB నాగిని స్టెప్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ప్రతి అడుగు పాట బీట్‌కు సరిగ్గా అనుగుణంగా ఉండే విధంగా డ్రైవర్ యంత్రాన్ని నియంత్రిస్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి వేణువును వాయిస్తున్నాడు. JCB ని తన రాగానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయిస్తున్నట్టుగా ఇక్కడ వాతావరణాన్ని సృష్టిస్తాడు. JCBడ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతాయి.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
వీడియో మొత్తం సమన్వయం చాలా ఆకర్షణీయంగా ఉంది. JCB నాగిని డ్యాన్స్ నిజంగా నిజమైనదిగా అనిపిస్తుంది. నెటిజన్లు తమ వినోదభరితమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.




