AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓరీ దేవుడో ఇదేం వైద్యం..! కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్‌ ఘటన. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత 22 ఏళ్ల రమాదేవి శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేశారు. తీవ్రమైన నొప్పితో బాధపడిన ఆమెకు స్కానింగ్ లో ఇది బయటపడింది. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. డాక్టర్ తన తప్పు కాదని వాదించారు.

Andhra Pradesh: ఓరీ దేవుడో ఇదేం వైద్యం..! కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు
Medical Negligence
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2025 | 3:15 PM

Share

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్ర ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ శరీరంలో సర్జికల్‌ బ్లేడ్‌ను వదిలేసిన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి (22) కుటుంబ నియంత్ర ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో చేరింది. రమాదేవికి ఆపరేషన్‌ చేశారు డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది. అయితే, ఆపరేషన్ తర్వాత ఆమె తీవ్రమైన నొప్పితో అవస్థ పడింది. దాంతో వెంటనే ఆమె తిరిగి ఆస్పత్రికి చేర్చారు. నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆసుపత్రి డాక్టర్,సిబ్బంది తిరిగి ఇంటికి పంపించేశారు.

ఈ క్రమంలోనే నొప్పి తట్టుకోలేక అవస్థ పడుతున్న బాధితురాలికి స్కానింగ్ చేయగా స్కానింగ్ రిపోర్ట్‌లో ఆమె తోడ దగ్గరలో ఒక సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు. అది చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల మండిపడ్డారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకి దిగారు. పైగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి సిబ్బంది 2500 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించింది.

అయితే, యువతి శరీరంలో సర్జికల్ బ్లెడ్ ఉండడం తన తప్పు కాదని ఆపరేషన్ చేసిన డాక్టర్‌ చెబుతున్నారు. ఆపరేషన్ అనంతరం తనకు మరో కేసు ఉండటంతో వెళ్లిపోయానని, క్లినింగ్ చేసే వారు సరిగా క్లినింగ్ చేయలేదంటూ సమాధానం ఇచ్చారు డాక్టర్ నారాయణ స్వామి. కానీ, ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఇంత ఘోరమైన నిర్లక్ష్యానికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

​ఈ దారుణ ఘటన నేపథ్యంలో మహిళ కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్