ఇటీవల చాలా మంది ఆరోగ్య కారణాల వల్ల బంగాళాదుంపను తినడానికి ఇష్టపడరు. కానీ బంగాళదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనం తరచుగా మరచిపోతుంటాం. అవెంటో తెలుసుకుందాం..
ఇవి మన విదేశీ కూరగాయ. ఇప్పుడు పూర్తిగా భారతీయమైనవి. ముఖ్యంగా బంగాళదుంపలు లేకుండా కొందరు వంట కూడా చేయరు. ఉడికించిన, వేయించిన, ఇలా రకరకాల ఆలూ రెసిపీలు మనం టేస్ట్ చేయోచ్చు.
విటమిన్ సి, విటమిన్ బి-6, పొటాషియం, ఫైబర్ బంగాళదుంపలో పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి సమతుల్య ఆహారం కోసం బంగాళదుంపలు తినాలి.
బంగాళదుంపలుపొట్టుతో కలిపి తింటే పీచు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది కానీ బంగాళదుంపలు మితంగా తినాలి.
బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది ఆ సందర్భంలో, బరువు పెరగవచ్చు బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేయడానికి బదులుగా ఉడకబెట్టడం లేదా కాల్చడం ద్వారా తినండి.
బంగాళాదుంప తొక్కతో పాటు తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తొక్కలోని పోషకాలు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బంగాళదుంపలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులు మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
బంగాళదుంపలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులు మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయి
బంగాళదుంపలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సోడియం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. తగిన మోతాడులో తరచూ తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.