AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో జాగ్రత్త

తిరుమల వెంకన్న భక్తులను దళారులు టార్గెట్ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం సిఫారసులేఖల ఇప్పిస్తామని భక్తుల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం టీటీడీ వరకు వెళ్లడంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. తాజాగా ఇలా భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను అరెస్ట్ చేశారు.

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో జాగ్రత్త
Ttd
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Dec 05, 2025 | 3:03 PM

Share

ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నకిలీ సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనం చేయిస్తామని భక్తులను మోసగిస్తున్న ఇద్దరి దళారీలను అరెస్ట్ చేశారు తిరుపతి పోలీసులు. వీరిద్దరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తోపాటు ప్రజాప్రతినిధుల పేరుతో నకిలీ లేఖలను తయారు చేసి భక్తులను బురిడీ కొట్టిస్తున్నట్లు గుర్తించారు. వీళ్లు నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వీరు సూళ్లూరు పేట టిడిపి ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు టిడిపి ఎమ్మెల్యే పాశంసునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి పేర్లను దుర్వినియోగం చేస్తూ ఫేక్ లెటర్స్ ను తయారు చేశారు. దీంతో నిందితుల నుంచి ఫేక్ లెటర్స్ తో పాటు, బ్యాంక్ పాస్ బుక్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. టిటిడి విజిలెన్స్ నిఘాలో వెలుగు చూసిన ఈ వ్యవహారంపై గూడూరు వన్ టౌన్, తిరుమల టూ టౌన్ పీఎస్ లో కేసులు నమోదు అయ్యాయి.

మోసాలపై పోలీసుల ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనం కోసం దళారీలను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారి సేవా టికెట్లు టిటిడి అధికారిక వెబ్‌సైట్ లేదంటే కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని.. ఎవరైన దర్శనాల పేరుతో డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..