మధుమేహానికి చెక్ పెట్టే మెంతికూర మటన్ గ్రేవీ.. రుచి ఆహా.. బెనిఫిట్స్ ఓహో

Prasanna Yadla

01 March 2026

Pic credit - Pixabay

మటన్ తో ఏది చేసినా అదిరిపోతోంది. ఇక మెంతికూర మటన్ గ్రేవీ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. 

 మెంతికూర మటన్ గ్రేవీ

తెలుగు రాష్ట్రాల్లో ఈ కూర చాలా మంది తింటారు. మెంతికూర మటన్ కూర మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది 

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ 

ఈ మెంతికూర మటన్ కూరకు కావల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్ధాలు: అర కిలో మటన్, మెంతికూర, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం

కావాల్సిన పదార్ధాలు

అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నూనె, మసాలా పొడిను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా మటన్‌ను బాగా కడిగి దానికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక కప్పు పెరుగు వేసి 40 నిముషాల పాటు పక్కన పెట్టుకోండి.

స్టెప్ - 1

ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేస్ మసాలా దినుసులు రంగు మారే వరకు బాగా వేయించాలి

స్టెప్ - 2

 ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించికొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మటన్ ముక్కలు కూడా కలిపి ఒక టీ స్పూన్ కారం వేసి బాగా ఉడికించాలి.

స్టెప్ - 3

మటన్ ముక్కలు ఉడికిన తర్వాత మెంతికూర ఆకులు, కట్ చేసిన టమోటాలు ముక్కలు వేసి మసాలా పొడిని వేసి బాగా కలపాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీదే ఉంచండి. 

స్టెప్ - 4

ఇప్పుడు కుక్కర్ మూత తీసి మసాలా పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని దించే ముందు కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి మెంతి కూర మటన్ గ్రేవీ రెడీ. 

మెంతి కూర మటన్ గ్రేవీ రెడీ.