04 December 2025

అసలే చలిచంపేస్తుంటే.. నైట్ ఫ్యాన్ వేసి పడుకుంటున్నారా?

samatha

Pic credit - Instagram

చలికాలం స్టార్ట్ అయిపోయింది. రోజు రోజుకు చలి తీవ్రత అనేది విపరీతంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.

ఇక ఈ చలికాలంలో చాలా మంది ఫ్యాన్ ఆఫ్ చేసుకొని, పెద్ద పెద్ద రగ్గులు కప్పుకొని నిద్రపోతుంటారు. ఇది సహజం.

కానీ కొంత మంది చలికాలంలో కూడా ఫ్యాన్ ఆన్ చేసుకొని నిద్రిస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

శీతాకాలంలో ఫ్యాన్ వేసుకొని నిద్రపోవడం వలన చలి తీవ్రత, అలాగే చల్లటి గాలికి త్వరగా గొంతు నొప్పి, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుందంట.

చల్లటి గాలి కండరాలను తాగడం వలన ఇది మీరు ఉదయం లేచిన వెంటనే, వెన్ను లేదా మెడ నొప్పి వంటి కండరాల బలహీనత ఏర్పడుతుందంట.

చల్లటి గాలి అనేది శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. అందువలన ఇది మీ నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నదంట.

చల్లటి గాలికి ఎక్కువ సేపు ఉండటం వలన ఇది మీలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

అందుకే వీలైనంత వరకు చలికాలంలో రాత్రి సమయంలో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని పడుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.