చలికాలంలో ఉసిరి చేసే మాయే వేరు.. తింటే ఎన్ని లాభాలో..
samatha
Pic credit - Instagram
ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఉసిరి తినడం వలన అనేక లాభాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఈ సీజన్‌లో ఉసిరి ఎక్కువగా తింటారు.
ప్రతి రోజూ మీ ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వలన ఇది శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన చలికాలంలో ఉసిరి తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దగ్గు, జలుబు, నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చలికాలంలో జీర్ణ క్రియ మందగిస్తుంది. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అటువంటి సమయంలో ఉసిరి తినడం చాలా మంచిది.
శీతాకాలంలో ప్రతి రోజూ ఉసిరి తినడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఉసిరిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది పేగు కదలికలను ప్రేరేపించడమే కాకుండా, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అలాగే ఉసిరి ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది అందానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తీసుకోవడం వలన జుట్టురాలడం, చర్మం పొడిబారడం సమస్యలు తగ్గుతాయి.