01 December 2025

చాణక్య నీతి :  ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ రోజులు ఉండదో తెలుసా!

samatha

Pic credit - Instagram

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

చాణక్యుడు డబ్బు గురించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎవరి దగ్గర డబ్బు నిలవదో వారి గురించి కూడా తెలియజేశాడు.

చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే సోమరిగా ఉంటారో వారి వద్ద డబ్బు అస్సలే నిలవదంట. వారికి మనీ అతి పెద్ద శత్రువు.

అలాగే కొందరికి తమ వద్ద ఉన్న డబ్బును చూసుకొని ఎక్కువగా అహంకారం చూపుతారు. అయితే అలాంటి వారి వద్ద డబ్బు నిలవదంట.

చాణక్య నీతి ప్రకారం ఎవరి ఇంటిలోనైతే పరిశుభ్రత ఉండదో, ఎవరి ఇల్లు అయితే ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటుందో వారి ఇంటిలో డబ్బు నిలవదంట.

అలాగే ఆదాయానికి మించి ఖర్చు చేసేవారి వద్ద కూడా డబ్బు నిలవదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

నిజాయితీ లేని వారు, ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించే వారి వద్ద కూడా డబ్బు నిలవదంట.

అలాగే, జ్ఞానం పొందడానికి ఎవరైతే నిరాకరిస్తారో వారి వద్ద కూడా డబ్బు నిలవదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.