క్రిస్మస్ వచ్చేస్తోంది.. ఈ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Samatha
30 November 2025
క్రిస్మస్ వచ్చేస్తోంది. ఇక ఈ సెలవుల సమయంలో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. కాగా మనం ఈ క్రిస్మస్‌కు ఏ ప్లేసెస్‌కు వెళ్తే బాగుంటుందో చూద్దాం.
కిస్మస్ సమయంలో కేరళలోని కుమారకోమ్ చాలా అద్భుతంగా ముస్తాబు అవుతుంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతాయంట. ఇక ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ప్లే్స్.
ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన ప్రదేశాల్లో కుమావోన్ ఒకటి. హిమాలయా పర్వతాల్లో చాలా తక్కువ మంది దీనిని సందర్శిస్తారు. డిసెంబర్ నెలలో సదర్శించడానికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.
గోవాలో క్రిస్మస్ వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక డిసెంబర్ నెల మొత్తం అక్కడ ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి డిసెంబర్‌లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇదే.
అద్భుతమైన ప్రదేశాల్లో కాశ్మీర్‌లోని శ్రీనగర్ కూడా ఒకటి. ఈ ప్లేస్ క్రిస్మస్ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. పర్యాటకులకు డిసెంబర్ నెలలో సందర్శించదగిన అద్భుతమైన ప్రదేశం ఇదే.
రాజస్థాన్ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇక క్రిస్మస్ సమయంలో ఎవరైతే ఎంజాయ్ చేయాలి అనుకుంటారో వారికి రాజస్థాన్ బెస్ట్ ప్లేస్.
రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా క్యాపింగ్ చేయొచ్చు, అదే విధంగా రాత్రి సమయంలో ఇసుక తిన్నెల్లో కూర్చొని చలి మంట కాగుతూ, ఎంజాయ్ చేయవచ్చు.
కేరళలోని మున్నార్ అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి ప్రదేశాలు చాలా అందంగా, ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కాబట్టి క్రిస్మస్ సమయంలో ఇక్కడికి వెళ్లి హ్యాప్పిగా ఎంజాయ్ చేయవచ్చు.