పొద్దు తిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుడి వైపే ఎందుకు చూస్తుందంటే?
Samatha
29 November 2025
పొద్దు తిరుగుడు పువ్వు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ ఇవి తెలుసు చూడటానికి చాలా అందంగా ఉండమే కాకుండా, వీటి వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇక పొద్దు తిరుగుడు పువ్వు నుంచి వచ్చే నూనె, వీటి గింజలు మీ డైట్‌లో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఇక పొద్దు తిరుగుడు పువ్వు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది, ఇది ఎప్పుడూ సూర్యుడి వైపే తిరిగి ఉంటుంది. మరి ఎందుకు అలా తిరుగుతుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
కాగా, ఇప్పుడు మనం అసలు పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఎటు వైపు ఉంటే అటు వైపు ఎందుకు తిరుగుతుంది. దీనికి గల కారణాలు ఏవో చూసేద్దాం పదండి.
పొద్దు తిరుగుడు పువ్వును సూర్యకాంత పుష్పం అనికూడా అంటారంట. ఈ పువ్వు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి పడమరన అస్తమించే వరకు సూర్యుడి వైపే చూస్తుంటుంది.
అయితే దీనికి గల ముఖ్య కారణం, ఇందులో ఉండే ఫొటో ట్రాపిజం అనే లక్షణం, అంటే కంటికి కనిపిచే సూర్య రశ్మి వలన ఇది పెరగడమే కాకుండా, ప్రతి స్పందనను కలిగి ఉంటుందంట.
ఈ పువ్వులో ఉండే ఆక్సిజన్ హార్మోన్ స్పందనను ప్రేరేపిస్తుందంట. ఈ హార్మోన్ మొక్ పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఇక ఈ పువ్వులో ఉండే ఫొటో ట్రాపిజం అనే లక్షణం మొక్కపై సూర్య రశ్మి నేరుగా పడినప్పుడు దాని వెనుక బాగంలో ఉండే కాండంపై నీడ పడుతుంది.
దీని వలన సూర్య రశ్మి తగలని చీకటి భాగంలో ఆక్సిజన్ హర్మోన్ ఉత్పత్తి అయ్యి, మొక్క వేగంగా పెరగడమే కాకుండా, అది కిరణాల వైపు కదిలలా ప్రోత్సహిస్తుందంట.