మీ ఇంటిలో గులాబీ మొక్కను పెంచుతున్నారా.. ఇలా చేస్తే చెట్టు నిండా పూలే..
Samatha
19 November 2025
గులాబీ పూలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది గులాబీ పూలే కాదండోయ్, గులాబీ మొక్కలంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది.
ముఖ్యంగా మహిళలు తమకు నచ్చిన గులాబీ మొక్కలను ఇంటిలో పెంచుకోవాలని అనుకుంటారు. కానీ అవి సరైన విధంగా పెరగక చాలా ఇబ్బంది పడుతుంటా
రు.
అయితే మీ ఇంటిలో గులాబీ మొక్క అందంగా ,వేపుగా పెరగడమే కాకుండా, చెట్టు నిండా పూలతో చూడటాని బాగుండాలి అంటే ఈ టిప్స్ పాటించాలి అంట.
గులాబీ మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం. అందువలన రోజు కనీసం 8 గంటలు సూర్యర్శి తగిలే ప్రదేశంలో మాత్రమే గులాబీ మొక్కను పెంచాలంట.
ఎర్రటి మట్టి లేదా, రాగడి మట్టిలో గులాబీ మొక్కను నాటడం వలన చాలా త్వరగా పెరుగుతుంది. అంతే కాకుండా చెట్టునిండా పూలనిస్తుంది.
కొందరు ప్రతి రోజూ నీరు పోస్తుంటారు. కానీ గులాబీ మొక్కకు వారానికి రెండు లేదా మూడు సార్లు నీరు పోయడం చాలా మంచిదంట. దీని వలన
మొక్క ఫంగస్ రాకుండా ఉంటుంది.
గులాబీ మొక్కను ఎప్పుడూ కూడా ఎక్కువ వేడి లేదా, ఎక్కువ చలి లేని ప్రదేశంలో పెంచాలి. దీని వలన మొక్క పొడవకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది.
గులాబీ మొక్కలను కాస్త దూరం దూరంగా, గాలి తగిలే ప్రదేశంలో పెట్టాలి. అదే విధంగా వీటికి ఎరువు చాలా అవసరం, ఎరువు వేయడం వలన మొక్కలు
మంచిగ పూలనిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి వాల్ పేపర్ మీ మొబైల్కు ఉంటే, జాతకంలో గ్రహదోషాలే!
మహిళల కలలో మంగళ సూత్రం కనిపించడం శుభమా? అశుభమా?
రాత్రి పూట లైట్స్ వేసుకొని నిద్రపోతున్నారా?