ఇలాంటి వాల్ పేపర్ మీ మొబైల్‌కు ఉంటే, జాతకంలో గ్రహదోషాలే!

Samatha

18 November 2025

 వాస్తు శాస్త్రం ప్రకారం, మొబైల్ ఫోన్‌లో ఈ మూడు రకాల వాల్ పేపర్స్ అస్సలే పెట్టుకోకూడదంట. దీని వలన ప్రతికూలతలు చోటు చేసుకునే అవకాశం ఉందంట. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వాస్తు నిపుణులు, తప్పకుండా ఏ పని చేసినా వాస్తు నియమాలను కూడా పాటించాలని సూచిస్తుంటారు. అయితే ఇది ఇల్లు, ఇంటి వాతావరణం వంటివాటికే పరిమితం కాదంట. మనం చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్‌కు కూడా వర్తిస్తుందంటున్నారు

వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. అందుకే దీని విషయంలో కూడా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంట.

వాస్తు శాస్త్రంలో మొబైల్ ఫోన్ వాల్ పేపర్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే. ఒక వ్యక్తి తన ఫోన్‌కు వాల్ పేపర్ పెట్టుకోవడానికి ఎన్నింటినో ప్రయత్నిస్తాడు. అవి ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతాయంట.

మొబైల్ వాల్ పేర్ అనేది ఒక మతపరమైన స్థలం, దేవాలయాలది అస్సలే పెట్టుకోకూడదంట. మీరు వెళ్లే ప్రదేశాల్లో ఆ వాల్ పేపర్ ఉండటం అనేది దేవతలను అవమానించడమే అంటున్నారు పండితులు

ప్రజలు తరచుగా తమ తమ భావోద్వేగాలతో కూడిన వాల్‌పేపర్‌లను పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఉదాహరణకు విచారం, మరణం, కోపం, అసూయ లేదా దురాశను ఇలా వారు ఉండే స్థితిని బట్టి వాల్ పేపర్ పెట్టుకుంటారు.

భావోద్వేగాలతో కూడిన వాల్‌పేపర్‌లను మొబైల్‌లో ఉంచడం వల్ల జీవితంలో ప్రతికూలత పెరుగడమే కాకుండా నిరాశ కూడా ఆవహిస్తుందంటున్నారు పండితులు.

అలాగే దేవుళ్ల ఫొటోలు కూడా వాల్ పేపర్‌గా పెట్టుకోకూడదంట.  ఇది మీ జాతకంలో గ్రహదోషాన్ని తీసుకొస్తుందని, అందుకే ఇటువంటి వాల్ పేపర్స్ పెట్టుకోకూదని చెబుతున్నారు పండితులు.