మెంతితో లేదు చింత.. దీన్ని తింటే ఇక అంతా మంచేనంట!

Samatha

13 November 2025

ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది దీనిని పప్పుల్లో, ఎక్కువగా వేసుకొని వండుకుంటారు.

తినడానికి కాస్త చేదుగా ఉన్నప్పటికీ, ఇది మంచి రుచిని ఇస్తుంది. అంతే కాకుండా మెంతి కూర తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంట.

మెంతి కూర తినడం  వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందువలన తప్పకుండా దీనిని మీ ఆహారంలో చేర్చుకోవాలంట.

మెంతిని మహిళలు తమ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది కడుపు నొప్పి, కడుపు మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కనీసం వారంలో రెండు సార్లు మెంతి తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

అలాగే, మెంతి ఆకులు డయాబెటీస్ పేషెట్స్‌కు వరం అని చెప్పాలి. ఇందలో ఉండే గ్లూకోజ్,టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

మెంతి ఆకుల పొడిని ఉపయోగించి తయారుచేసిన హెర్బల్ టీ అధిక జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించడానికి  ఎంతగానో ఉపయోగ పడుతుంది.

మెంతి ఆకుల్లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. ముఖ్యంగా హైబీపీ సమస్యతో బాధపడే వారు దీనిని రోజు తినడం చాలా మంచిది.