కరివేపాకుతో బోలెడు ప్రయోజనాలు.. రోజూ తింటే ఎంత మంచిదో

Samatha

12 November 2025

కరివేపాకులను ప్రతి ఒక్కరూ తమ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ముఖ్యంగా కంటికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

కరివేపాకు ఆకలు సిట్రస్ రుచిని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా సూప్ చట్నీల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది వంటకాలకు మంచి రుచిని ఇస్తుంది.

అయితే రుచిని, వాసనను ఇవ్వడమే కాకుండా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కరివేపాకును వంటల్లో ఉపయోగించడం వలన ఇది జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా మలబద్ధకం, విరేచనాల వంటి సమస్యలను తగ్గిస్తుంది.

కరివేపాకులో యాంటీ హైపర్గై్ స్లీమిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.

కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 కరివేపాలో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన దీనిని తీసుకోవడం వలన , ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దృష్టి మెరుగు పడుతుంది.