తులసి వివాహం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Samatha
31 october 2025
తులసి వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మహిళలు అందరూ ఉదయాన్నే తల స్నానం చేసి, పూజ చేసి, తులసి వివాహాన్ని జరిపిస్తారు.
తులసి వివాహాన్ని కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథి రోజు జరుపుతారు. అందుకే ఈ రోజును చాలా పవిత్రమైన రోజు అంటారు. ఇలా తులసి వివాహం జరిపించడం చాలా మంచిది.
ఆచారాల ప్రకారం, ఎవరైతే శుభ సమయంలో తులసి వివాహం జరిపిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వార్యాలు విల్లివిరియడమే కాకుండా, ఆ ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుందంట.
కాగా, ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో తులసి వివాహం ఎప్పుడు జరిపించాలి. తులసి వివాహం జరిపించడానికి శుభ సమయం ఏంటి, దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
అయితే ఈ సంవత్సరం నవంబర్ 2న ఆది వారం రోజున తులసి వివాహం జరిపించాలంట. ఈరోజున తులసి మాతకు, శాలి గ్రామ రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేస్తారు.
తులసి వివాహం రోజున తులసి చెట్టును అందం, ప్రత్యేకంగా అలకరించాలంట. దీని వలన తులసి మాత సంతోషించి ఆశీర్వాదాలు అందిస్తుందంట. అందుకే ఈ రోజు తులసి చెట్టును పూలతో అలంకరించాలి.
కార్తీక మాసం శుక్ల పక్ష ద్వాదశి తిథి నవంబర్ 2న ఉదయం 7:31 గంటలకు ఆరంభమవుతుంది. ఈ తిథి నవంబర్ 3న ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ సంవత్సరం తులసి వివాహం నవంబర్ 2న నిర్వహించుకోవాలి.
తులసి ప్రకృతిని సూచిస్తుంది. అందువలన తులసి వివాహం జరిపించడం వలన ప్రకృతి , దేవుని మధ్య సమతుల్యత గల సందేశాన్ని తెలుపుతుంది. అలాగే తులసి వివాహం జరిపించడం వలన జీవితంలో సానుకూల శక్తి లభిస్తుందంట.