కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
Samatha
29 october 2025
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఉసిరి దీపం వెలిగిస్తుంటారు. మరి దీని ప్రాముఖ్యత ఏంటీ? కార్తీ మాసంలోనే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు శైవ క్షేత్రాలు భక్తులతో, ఉసిరి దీపాలతో నిండిపోతాయి.. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది ఆలయాల్లో ఉసిరి దీపాలు వెలిగిస్తారు.
కాగా, అసలు కార్తీక మాసంలోనే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు, కార్తీక మాసానికి, ఉసిరి దీపానికి ఉన్న సంబంధం ఏంటీ? దీని గురించి పండితులు ఏమంటున్నారంటే?
వ్యాసమహర్షి శివ పురాణం ప్రకారం, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం చేస్తారు. దీని వలన కష్టాలు తొలిగిపోతాయంట.
అలాగే , కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందంట. అంతే కాకుండా నవగ్రహ దోషాలు తొలిగిపోయి సంతోషంగా ఉంటారంట.
అదే విధంగా ఉసిరి చెట్టుపై దేవుళ్లు అందరూ కొలువై ఉంటారని అంటారు. అందువలన కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి చెట్టుకింద భోజనాలు చేయడం చేస్తుంటారు.
అలాగే ఉసిరికాయ లక్ష్మీ దేవి ప్రతి రూపమని, ఈ మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో, వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయని నమ్మకం.
అందువలన అంత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి దీపం వెలిగిస్తారు. అంతే కాకుండా ఈ మాసంలో ప్రతి రోజూ తులసి చెట్టు కింద దీపం పెడుతుంటారు.