ప్రకృతిలో పరవశించి పోతూ.. బుట్ట బొమ్మ క్యూట్ ఫొటోస్!

26 october 2025

Samatha

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.

మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది.

మొదటి సినిమాలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకొని, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరసగా ఆఫర్స్ కొట్టేసి, అందరి సరసన నటించి మెప్పించింది.

ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య, జూనియర్ ఎన్టీ ఆర్, ఇలా చాలా మంది స్టార్స్ సరసన నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది.

కానీ ఈ బ్యూటీ చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోకపోవడంతో మెల్లిగా తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్, కోలీవుడ్ చక్కెసి అక్కడ తన లక్కు పరీక్షించుకుటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ ఫొటోస్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. ముఖ్యంగా తన అంద చందాలతో అందరినీ ఆగం చేస్తుంది.

అయితే తాజాగా ఈ చిన్నది ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ ఉన్న క్యూట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.