అచ్చం దేవతనే.. మహాలక్ష్మిలా బుల్లితెర ముద్దుగుమ్మ!

25 october 2025

Samatha

అందాల చిన్న మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ మహాలక్ష్మిలా రెడీ అయ్యి తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

మౌన రాగం సీరియల్‌తో మంచి గర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. ఈ అమ్మడు ఈ సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అందరి ఫ్యామిలీలో ఒకటైపోయింది.

బుల్లితెరపై మౌన రాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకొని, తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో సీజన్ 7లోకి అడుగు పెట్టి తన ఆటతీరుతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌గా నిలిచింది

ఇక ఈ చిన్నది సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ప్రియుడితో దిగిన ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.

అలాగే ఎప్పుడూ చాలా పద్ధతిగా ఉండే ఈ చిన్నది ఈ మధ్య ఎక్కువగా గ్లామర్ ఫొటో షూట్స్ చేస్తూ. తన అంద చందాలతో అందరినీ మాయ చేసింది.

ఇక చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ సంప్రదాయ పద్ధతిలో, చీరకట్టులో, ఒంటి నిండా నగలు ధరించి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా చాలా మంది మహాలక్ష్మిలా చాలా అందంగా ఉన్నావు, రెడ్ కలర్ చీరలో, ఒంటినిండా నగలతో అచ్చం దేవతలా చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.