పరికిణిలో బుట్ట బొమ్మలా.. మెగా డాటర్ బ్యూటిఫుల్ ఫొటోస్!

21 october 2025

Samatha

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

అందాల కుందనపు బొమ్మ నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది హీరోయిన్‌గా పలు సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ చేసిన పలు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఈ బ్యూటీ నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తుంది.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని విడాకుల తర్వాత ఈ బ్యూటీ తన లైఫ్ ను పూర్తిగా మార్చేసుకుంది.

నిర్మాతగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ దీపావళి సందర్భంగా పరికిణిలో అందంగా తయారయ్యి తన క్యూట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ బ్యూటీని చూస్తే రెండు కళ్లు చాలవు.

దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్, పరికిణిలో అందంగా ఉంటున్నావు, అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.