అల్పాహారంలో ఓట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

20 october 2025

Samatha

ఓట్స్ ఒక సూపర్ ఫుడ్. అందువలన దీనిని ప్రతి రోజూ మార్నింగ్ సమయంలో అల్పాహారంగా తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఓట్స్ ‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని టిఫిన్‌గా తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంటాయి.

ఓట్స్ నువ్వు ప్రతి రోజూ క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకోవడం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

ఓట్స్‌లో వోట్మీల్ విటమిన్స్, ఖనిజాలు వంటివి చాలా ఎక్కువ మొతాదులో ఉంటాయి. అందువలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

ప్రతి రోజూ మీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వలన ఇది జీర్ణ క్రియ సాపీగా సాగేలా చేసి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

ఓట్స్ తినడం వలన అలెర్జీ, దురద వంటి చర్మ సమస్యలు కూడా రావంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ఫైబర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందంట.

ఓట్స్ మధుమేహానికి చెక్ పెడుతాయి. ఈ రోజుల్లో చాలా మంది మధుమేహ సమస్యతో బాధపతున్నారు. అలాంటి వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

ఓట్స్ లో బీగ్లూకాన్, ఫైబర్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. అందువలన వీటిని మీరు మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సమస్యలను తగ్గిస్తుంది.