కంటి నిండా , హాయిగా నిద్రపోవాలంటే, ఏవైపు పడుకోవాలో తెలుసా?

11 october 2025

Samatha

నిద్ర ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సరిపడ నిద్రపోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకే ప్రతి ఒక్కరూ సరిపడ నిద్రపోవాలని చెబుతారు.

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఏడు గంటలైనా నిర్మించాలంటారు. కానీ స్మార్ట్ ఫోన్ ప్రభావం వలన చాలా మంది ఆలస్యంగా నిద్రపోతూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ సేపు గడపడం వలన నిద్రపోకపోతే, మరికొంత మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

అయితే ఎలాంటి టెన్షన్స్ లేకుండా, హాయిగా కంటినిండా నిద్రపోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందేనంట. త్వరగా నిద్రపోవాలంటే ఇలా చేయాలంట.

ఎడమవైపు పడుకోవడం చాలా మంచిదంట. ఈ వైపున తిరిగి పడుకోవడంవలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఈ వైపు పడుకోవడం వలన త్వరగా నిద్రపట్టడమే కాకుండా హాయిగా నిద్రపోతారంట.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగు పడుతుందంట. అంతే కాకుండా శరీరం తేలికగా అయ్యి త్వరగా నిద్రపట్టేస్తుందంట.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన యాసిడ్ రి ఫ్లక్స్ , గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయంట. అందుకే ఈ వైపు తిరిగి పడుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది, హాయిగా నిద్రపట్టేస్తుందంట.