చాణక్య నీతి : మహిళలు వంట గదిలో చేయకూడని తప్పులు ఇవే!

09 october 2025

Samatha

ఆచార్య చాణక్య తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు, తెలివైన వ్యక్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. తన జీవితకాలంలో, అతను అనేక విషయాలను తాను రచించిన నీతి శాస్త్రం పుస్తకం ద్వారా తెలిపారు.

అతను చెప్పిన సూత్రాలు నేటి సమాజంలో ఉన్న వారికి ఎంతో స్పూర్తిగా ఉన్నాయి. అలాగే అవి వారికి ఆదర్శప్రాయంగా కూడా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇక చాణక్యుడు మహిళల గురించి ఎన్నో  విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన మహిళలు వంటి ఇంట్లో చేయకూడని తప్పుల గురించి తెలిపాడు.

ఆచార్య చాణక్య ప్రకారం, ఒక స్త్రీ వంట చేసేటప్పుడు  కొన్ని తప్పులను పదే పదే చేయడం వలన అది కుటుంబ ఆనందం, శ్రయేయస్సుపై ప్రభావం చూపుతుందంట.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్త్రీ వంట చేసేటప్పుడు ఎప్పుడూ ఇతరులతో మాట్లాడకూడదంట.  వంటపైనే  ధ్యాస పెట్టి వండటం వలన ఆ ఇంటిలో ఆనందం నెలకుంటుంది.

అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ స్నానం చేయకుండా వంట చేయకూడదంట. స్నానంచేయకుండా వంట చేయడం చాలా పాపం అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

అలాగే ఏ స్త్రీ అయినా సరే కోపంగా, తిట్టుకుంటూ, వాదిస్తూ వంట చేయకూడదంట. ఇలా వంట చేయడం వలన ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా, అప్పులు పెరుగుతాయంట.

అంతే కాకుండా అలాంటి ఆహారం తీసుకోవడంలో కుటుంబ సభ్యులు కూడా అసహనానికి గురి అవుతారు. దీని వలన అన్నపూర్ణా దేవికి కోపం వస్తుందంట.