అనసూయ అందాల సెగలు.. కంటి చూపుతోనే చంపేస్తుందిగా..!

05 october 2025

Samatha

అనసూయ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన అంద చందాలతో, నటనతో ఎంతో మంది మనసు దోచేసుకుంది.

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ తన మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

తర్వాత సొగ్గాడే చిన్న నాయన సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి.

ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి చాలా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ రంగస్థలంలో నటించింది.

ఈ మూవీలో రంగమ్మత్త పాత్రలో ఇరగదీసి, వరసగా ఆఫర్స్ అందుకుంది. పుష్ప, పుష్ప2లో దాక్షాయణి పాత్రలో కూడా తన విలనిజంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ,  వరసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్‌తో కూడా అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ప్రస్తుతం షోలు , సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ, తాజాగా ఎల్లో కలర్ లెహెంగా ధరించి తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

తన కంటి చూపుతో చంపేస్తూ.. అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.