దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. ఇది ఏ దేశాల్లో ఎక్కువుందో తెలుసా!

26 September 2025

Samatha

మహిళలు ఎక్కుగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. అయితే చాలా మంది ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే గోల్డే ఎక్కువ కొనుగోలు చేస్తారు

కానీ ఈరోజుల్లో బంగారం కొనడం చాలా కష్టంగా పెరిగింది. ఎందుకంటే? భారత్‌లో బంగారం ధరం లక్ష చిల్లర దాటి పరుగులు పెడుతుంది.

అయితే భారత్‌లో బంగారం నిల్వలు తక్కువ ఉండటం వలన దీనికి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి అసలు ప్రపంచంలో ఏ దేశాల్లో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయో చూద్దాం.

బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ 2025 రెండో త్రైమాసికం నాటికి 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయంట

తర్వాత స్థానంలో జర్మనీ ఉంటుందంట. ఇక్కడ ఈ సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి 3,350.25 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయంట.

అంతే కాకుండా ఇటలీలో కూడా బంగారం అధికంగానే ఉన్నదంట. ఇక్కడ 2,452.84 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం.

ఫ్రాన్స్‌లో కూడా బంగారం నిల్వలు అధికంగా ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంటుంది.

ఇక రష్యా ఐదోస్థానంలో,చైనా, స్విట్జర్లాండ్ ఏడో స్థానంలో ఉండగా, బంగారం నిల్వలో ఇండియా ఏనిమిదో స్థానంలో ఉన్నదంట.