మంగళవారం ఈ పనులు చేశారో.. మీకు కష్టాలే కష్టాలు

15 September 2025

Samatha

మంగళ వారం రోజున ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఈరోజున హనుమాన్‌ను పూజించడం వలన చాలా మంచి జరుగుతుందంట.

ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు, అలాగే ఆయన మంగళ వారం జన్మిచాడని చెబుతుంటారు. అందు వలన ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంట.

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ వారం రోజున కొన్ని పనులు చేయడం వలన  జీవితంలో దురృష్టాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు పండితులు.

మంగళ వారం రోజున హింసకు పాల్పడ కూడదంట. అలాగే ఈ రోజున  ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించడం, నాన్ వెజ్ తినడం చేయకూదంట.

మంగళ వారం పొరపాటున కూడా వాయువ్యం, పడమర లేదా ఉత్తరం వైపు ప్రయాణించకూడదు. ఈ దిశలో ప్రయాణించడం అశుభ శకునంగా పరిగణించబడుతుంది. 

మంగళవారం నాడు పొరపాటున కూడా నల్లటి దుస్తులు, ఇనుము, గాజు, సౌందర్య సాధనాలను కొనకూడదు, అలా చేయడం అశుభకరమని భావిస్తారు. 

 మంగళవారం నాడు గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం కత్తిరించుకోవడం అశుభమని భావిస్తారు . దీని వలన ఆయుష్షు ఎనిమిది నెలలు తగ్గుతుందంట.

నోట్ పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, ఇది వారి వారి మత విశ్వాసాల పై ఆధారపడి ఉంటుంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.