ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న న్యూ ట్రెండ్.. మీరు ట్రై చేస్తారా?
13 September 2025
Samatha
ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు నానో బనానా ఇమేజ్‌స్ దర్శనం ఇస్తున్నాయి. చాలా మంది ఈ ట్రెండ్ తెగ ఫాలో అవుతున్నారు.
తమ ఫొటోలను అందంగా చిన్న స్టాచ్యూలా రెడీ చేసుకొని తెగ సంబరపడుతున్నారు. ప్రతి ఒక్కరూ దీనిని ట్రై చేస్తూ..స్టేటస్‌లతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్నారు.
మరి ఇలా మీరు కూడా ట్రై చేస్తారా... మీ ఫొటోలను అందంగా ఇలా రెడీ చేసుకోవాలని ఆరాటపడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే!
నానో బనానా ట్రెండ్ ద్వారా ఫొటోలను 3 D టాయ్ మోడల్స్‌గా మార్చుకొవచ్చు. ప్రస్తుతం ఈ ట్రెండ్ చాలా మంది ఫాలో అవుతూ తమ ఫొటోస్, తమ ఫేవరెట్ యాక్టర్స్ ఫొటోస్ ట్రై చేస్తున్నారు.
అయితే దీని కోసం ముందుగా, గూగుల్ AI స్టూడియో వెబ్ సైట్‌కు లాగిన్ అవ్వాలి.( ai.google.com) దీని కోసం ఎలాంటి ఫీజు, సబ్ స్ర్కిప్షన్ అవసరం లేదు.
తర్వాత ట్రై నానో బనానా ట్రెండ్ లేదా జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోను అప్లోడ్ చేయాలి.
ఆ తర్వాత మీ ఫొటో కోసం టెక్ట్స్ ప్రాంప్ట్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రెండు మూడు లైన్స్‌లో కొంత సమాచారం అందివ్వాలి.
తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఫొటో, ప్రాంప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని సెకన్స్‌లోనే కింద మీ ఫొటో 3D ఇమేజ్ టాయ్‌లా వచ్చేస్తుంది. అంతే మీ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.