చీపురు మంచం కింద పెట్టడం శుభమా? అశుభమా?

12 September 2025

Samatha

ఇంట్లోని ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం ఉంటుంది. అందుకే ఎక్కడ ఏ స్థానంలో పెట్టాల్సిన వస్తువులు, అక్కడే పెట్టాలని చెబుతుంటారు.

అయితే కొంత మంది చీపురును ఇంటి మంచం కింద పెడుతుంటారు. మరి ఇలా మంచం లేదా బెడ్ కింద చీపురు పెట్టడం మంచిదో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని లక్ష్మీదేవిగా కొలుస్తారు. అందుకే చీపురు విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంటారు.

అయితే కొందరు చీపురును మంచం కింద పెడుతుంటారు. కానీ ఇలా పెట్టడం చాలా అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు.

మంచం లేదా బెడ్ అనేది శాంతికి, సుఖ నిద్రకు ప్రతీక . అయితే ఆ స్థానం వద్ద చీపురు ఉంచడం వలన ప్రశాంతత కరువు అవుతుందంట.

అదే విధంగా మంచం కింద చీపురు పెట్టడం వలన నిద్రలేమి, అలసట, మానసిక సమస్యలు, ఒంత్తిడి వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

అంతే కాకుండా మంచం కింద చీపురు పెట్టడం వలన ఇంట్లో పేదరికం ఏర్పడుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

చీపురు మంచం కింద పెట్టుకొని ఏ వివాహిత జంటలు అయితే నిద్రపోతారు, వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయంట.