నవ్వచ్చుగా.. చిన్న నవ్వుతో ఎంతో మేలు? 

09 September 2025

Samatha

చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుందని, దీని వలన బాధ తగ్గుతుందని చెబుతుంటారు నిపుణులు.

అంతే కాకుండా నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలంటారు.అలాగే ఎప్పుడైనా బాధ కలిగినా లేదా ఒత్తిడికి లోనైనా ఎందుకు బాధపడుతున్నారు.

కాస్త నవ్వూ అంటూ మన వారు చెబుతారు. ఎందుకంటే నవ్వితే మనసులో ఉన్న బాధ పోతుంది,  అంతే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నిజంగానే నవ్వితే మనసులో ఉన్న బాధ, ఒత్తిడి రెండూ తగ్గుతాయా ? దాని గురించే తెలుసుకుందాం.

అయితే బాధ లేదా టెన్షన్ లో ఉన్నప్పుడు గుండె కొట్టకునే వేగం పెరుగుతుంది. దీంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది.

ఇలాంటి సమయంలో చిన్న చిరు నవ్వు నవ్వితే నిజంగా మనసు కాస్త తేలికపడుతుంది అంటున్నారు నిపుణులు.

బాధ సమయంలో నవ్వినప్పుడు గుండె రేటు స్థిరంగా కొట్టుకుంటుందంట. దీని వలన భావోద్వేగం కాస్త సానుకూలంగా ఉంటుంది.

దీంతో మన మనసులో ఉన్న ఒత్తిడి, బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెళ్లడైనట్లు పరిశోధకులు తెలిపారు