బట్టతల ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ వార్త తెలిస్తే ఎగిరి గంతేస్తారు అంతే!
07 September 2025
Samatha
ప్రస్తుతం చాలా మంది బట్టతలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
బట్టతల సమస్యతో బాధపడే వారు, దానిని నుంచి బయటపడటానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్, షాంపూస్, కొందరు మెడిసిన్ కూడా వాడుతారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, చాలా మంది ఆ సమస్య నుంచి బయటపడ లేకపోయేవారు. కానీ ఈ కొత్త మందుతో బట్టతల సమస్యకు చెక్ పెట్టవచ్చునంట.
బట్టతల సమస్యతో బాధపడే వారికి పెలగే ఫార్మాన్యూటికల్స్ గుడ్ న్యూస్ అందించింది. పీపీ405 అనే మందుతో జుట్టు త్వరగా పెరుగుతుందని తేల్చి చెప్పింది.
పీపీ 405 అనే మందును బట్టతలపై సహజంగానే జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుందంట. దీనిపై ట్రయల్స్ నిర్వహించిన వారందరికీ ఎనిమిది వారాల్లో మంచి రిజల్ట్ కనిపించినట్లు వారు వెల్లడించారు.
పీపీ 405 అనే మందును ఎనిమిది వారాలు ప్రతి రోజూ వాడిన వారికి, నెత్తి చర్మంపై నిష్రియంగా ఉన్న రంధ్రాలను తెరుచుకొని సహజంగానే 20 శాతం కంటె ఎక్కువగా జుట్టు ఒత్తుగా పెరిగిందంట.
అయితే ఇది బట్టతల సమస్యకు చెక్ పెట్టినప్పటికీ, దీని వలన స్వల్ప దుష్పలితాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది.