ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి!

03 September 2025

Samatha

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేసాయి. దీంతో ప్రతి పల్లె, పట్నంలో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది.

చాలా మంది తమ ఊరి చెరువు లేదా వాగు వంటి వాటిల్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమ ఇంటిలోనే నిమజ్జనం చేస్తుంటారు.

పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి కొందరు తమ ఇంటిలో వినాయకుడి నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలు తప్పక గుర్తించుకోవాలంట.

మీ వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు కొన్ని వస్తువులను తప్పక మీ దగ్గర పెట్టుకోవాలంట. అందులో నీరు, తొట్టే,పువ్వులు, పండ్లు, ఆకులు తప్పనిసరి.

కొంత మంది ఉదయం పూజ చేసి సాయంత్ర పూజ చేయకుండానే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. కానీ అస్సలే అలా చేయకూడదంట.

చివరి సారి పూజ చేసిన తర్వాత , గణపయ్యకు ఇష్టమైన పాటలు పాడుతూ, చివరిసారిగా హారితి, ప్రసాదం సమర్పించి, ఆనందంగా నిమజ్జనం చేయాలంట.

దీని కోసం మీరు ముందుగా, ఒక పెద్ద పాత్రలో నీటిని నింపి, అందులో పసుపు, కుంకుమ వేసి మట్టి గణపతి విగ్రహాన్ని ఉంచి, నెమ్మదిగా నీటిలో కరిగిపోయేలా చేయాలి. 

ఇది త్వరగా కరిగిపోతుంది. అయితే ఇంటిలో నిమజ్జనం చేసినప్పడు మట్టిగణపతిని మాత్రమే నిమజ్జనం చేయాలంట. ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోవు.