చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!

01 September 2025

Samatha

ఈ మధ్య చాలా మంది చియా గింజలు ఎక్కువగా తింటున్నారు . ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గుతారని వీటిని ఎక్కువగా తినేవారు ఉన్నారు.

కానీ చియా గింజలు అతిగా తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుులు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదంట.

చియా గింజల్లో ఒమెగా 3, ఫైబర్, ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని చాలా మంది ఓట్స్ లేదా ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకొని ఎక్కువ తింటారు.

కానీ చియా గింజలు అస్సలే రాత్రి సమయంలో తినకూడదంట. నైట్ టైమ్ చియా సీడ్స్ తినడం వలన ఇవి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తీసుకొస్తాయంట.

అలాగే కొంత మంది వీటిని నానబెట్టి కాకుండా పొడిగా తీసుకుంటారు. వీటిని పొడిగా తీసుకోవడం వలన కడుపునొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో కూడా చియా సీడ్స్ తినకూడదంట. ఇలా తింటే అధిక ఫైబర్ కారణంగా, గ్యాస్, మలబద్ధకం సమస్యలు వస్తాయంట.

అదే విధంగా చియా సీడ్స్ నానబెట్టి తీసుకున్న తర్వాత కూడా, తప్పనిసరిగా తగినన్ని నీరు తీసుకోవాలంట. లేకపోత అది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివైనా సరే అస్సలే రాత్రి సమయంలో తీసుకోకూడదంట. రాత్రి సమయంలో చియా సీడ్స్ తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య వస్తుందంట