నాగార్జున గురించి ఎవ్వరికీ తెలియని టాప్ 10 సీక్రెట్స్ ఇవే!
Samatha
29 August 2025
Credit: Instagram
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన నేడు (ఆగస్టు 29) 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
కాగా, ఆయన జన్మదినం సందర్భంగా, నాగార్జున గురించి ఎవ్వరికీ తెలియని టాప్ 10 సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం.
నాగార్జున తొలిసారిగా 1961లో వెలుగు నీడలు, సుడిగుండాలు చిత్రంలో బాలనటుడిగా నటించారు. తర్వాత విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
నాగార్జున సినిమాల్లోకి రాకముందు అమెరికాలో శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ కంప్లీట్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియో యజమాని, పలు వ్యాపారాలు చేయడమే కాకుండా, టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈయన ఒకరు. సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంటాడు.
యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహించి, వారి ప్రతిభను పెంపొందించడానికి ఫిల్మ్ స్కూల్ స్థాపించి, ఎంతో మందిని తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.
అలాగే అక్కినేని అమలతో పాటు తాను కూడా జంతు సంరక్షకుడు. జంతువుల రక్షణ కోసం నాగార్జున బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సహ స్థాపించారు.
జపాన్‌లో అక్కినేని నాగార్జునకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనను అక్కడి అభిమానులు నాగ్ సామ అని గౌరవంగా పిలుస్తారు. జపనీస్ భాషలో సామ అంటే గొప్ప వారికి ఇచ్చే బిరుదు.
నాగార్జునకు ధ్యానం అంటే చాలా ఇష్టం, తన సమతుల్య జీవనశైలికి ధ్యానం కారణం అంటారు. అలాగే ఈయన అనేక భాషల్లో నటించారు, భక్తి సినిమాల్లో తన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు