ప్రస్తుతం చాలా మంది గుండె సంబధమైన సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడతాయంట.
గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపదార్థాల్లో చియా గింజలు ముందుంటాయి. ఇందులో సెలెనియం, మాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
సోయా బీన్స్‌లో అధికంగా ఫైబర్ , ఓమెగా 3, విటమిన్ కే, మెగ్నీషియం ఉండటం వలన ఇది గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ ఈ, కాపర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇది గుండెను కాపాడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవాటిలో అవిస గింజలు ఒకటి, వీటిని ప్రతి రోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి మీ గుండెకు మేలు చేస్తాయి.
ఎడమామెలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అందువలన ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వలన ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అదే విధంగా కాఫీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, అందువలన ప్రతి రోజూ ఒక కప్పు టీ తాగితే ఇది గుండెకు మేలు చేస్తుందంట.
దానిమ్మ పండ్లు, ఆపిల్స్, చియా సీడ్స్ వీటన్నింటిని ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.