ఆరోగ్యానికి వరం.. పాలకూర ఎందుకు తినాలో తెలుసుకోండి!

Samatha

30 August  2025

Credit: Instagram

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పాలకూర తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటున్నారు వైద్య నిపుణులు.

కానీ కొంత మంది పాలకూర తినడానికి అస్సలే ఇష్టపడరు. కాగా, ఇప్పుడు మనం పాలకూర తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.

పాలకూరలో కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

పాలకూరలో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉండటం వలన ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

పాలకూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి , శరీరానికి తక్షిణ శక్తినిస్తాయి.

పాలకూరలో ఐన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది

పాలకూరలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గించి, క్యాన్సర్ నుంచి కాపాడతాయి.

ఇక ఇందులో కాల్షియం,ఆక్సలేట్లు ఎక్కువగా ఉండం వలన మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. అందువలన అతిగా తీసుకోవడం మంచిది కాదంట.