డేంజర్ : ఖాళీ కడుపుతో పాలు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

04 September 2025

Samatha

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు. అందుకే కొంత మంది టీ, కాఫీలకు బదులు ఉదయాన్నే గ్లాస్ పాలు తాగుతుంటారు.

కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగడం వలన ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కాదు కానీ , అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

ఖాళీ కడుపుతో పాలు తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణుల. కాగా, దాని గురించే తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో పాలు తాగడం వలన ఇది కడుపులో సహజ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందంట. దీని వలన గ్యాస్ ,ఎసిడిటీ సమస్య వస్తుదంట.

అంతే కాకుండా కొందరిలో వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలకు కూడా కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే ఖాళీ కడుపుతో ఉదయాన్నే పాలు తాగడం వలన ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. జీర్ణక్రియ సాఫీగా సాగదంట.

అందువలన మార్నింగ్ ఖాళీ కడుపుతో కాకుండా, అల్పాహారం తీసుకున్న కొద్ది సేపటి తర్వాత పాలు తాగాలని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా రాతరి వేళలో పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబతుున్నారు. పడుకునే ముందు పాలు తాగడం వలన ప్రశాంతమైన నిద్ర పడుతుందంట.