ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఏపీలో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!

10 September 2025

Samatha

ఫ్యామిలీ లేదా స్నేహితులతో ట్రిప్ ఫ్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన సమాచారం.

పచ్చటి ప్రకృతిలో అందమైన  తోటలు, ఎత్తైన కొండలు మధ్య ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు.

ఏపీలోనే అద్భుతమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. కాగా, పొగ మంచు, అందంగా గుడ్ మార్నింగ్ చెబుతూ అందరి మనసు దోచే బెస్ట్ హిల్ స్టేషన్స్ ఎక్కడెక్కడున్నాయో చూద్దాం.

అరకు లోయ, విశాఖపట్నం నుంచి కేవలం 115 కి.మీ దూరంలో ఉండే ఇది పొగమంచుతో కూడి, అందమైనలోయలు, జలపాతాల, కాఫీ తోటలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

హార్ల్సీ హిల్స్, దఅందమైన పక్షులు, అడవులు, యూకలిప్టస్ అడవులను చూసేందుకు అద్భుతమైన ప్రదేశం ఇది. 1270 మీటర్ల ఎత్తులో అద్భుతంగా ఉంటుంది.

లంబసింగి, ఇక్కడి ప్రదేశం చూడటానికి రెండుకళ్లు చాలావు. కాఫీతోటలు, అందమైన, దట్టమైన అడువులు మంచి వాతావరణం, చాలా బాగుంటుంది.

మినీ ఊటీగా పేరుగాంచిన అనంతగిరి కొండల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్నేహితులు లేదా ఫ్యామిలీతో ఏంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్.

నల్లమల కొండలు, ఏపీలోని అతి పెద్ద కొండల్లో ఇవి ఒకటి. వన్యప్రాణుల ప్రేమికులకు, ట్రెక్కింగ్ చేసే వారికి ఈ ప్లేస్ స్వర్గధామం.